ఐపీఎల్ 2023లో అట్టర్ ఫ్లాప్ అయిన రోహిత్ శర్మ, వెస్టిండీస్ టూర్‌లో ఓ టెస్టు సెంచరీ కొట్టాడు. 2007లోనే అంతర్జాతీయ క్రికెట్ లోకి ఆరంగ్రేటం చేసిన రోహిత్, 2011 వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కలేదు. దీంతో రిటైర్ అయ్యేలోగా వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని గెలవాలని రోహిత్ అనుకున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే ప్రపంచకప్ లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన యువరాజ్ లాంటి ప్లేయర్ టీమిండియాలో ప్రస్తుతం లేరు.
Read Also: Prakash Raj: మణిపూర్ మండిపోతుంటే పార్లమెంటులో సమస్య పరిష్కారంపై మాట్లాడారా..?
అయితే, టీమిండియాపై యువరాజ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ ప్రస్తుతం ఫామ్‌లో లేడు.. కొన్నేళ్లుగా అతని బ్యాటు నుంచి మంచి ఇన్నింగ్స్ రాలేదు అని యువీ తెలిపాడు. కానీ 2019 వరల్డ్ కప్ ముందు కూడా రోహిత్ ఫామ్‌లో లేడు.. అప్పుడు నన్ను కలిశాడు. నేను రోహిత్ శర్మకు ఒక సలహా ఇచ్చాను.. ఆ తర్వాత.. వరల్డ్ కప్‌లో ఏకంగా 5 సెంచరీలను బాదేశాడు అని యువరాజ్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇప్పుడు కూడా వరల్డ్ కప్ ముందు రోహిత్ ఫామ్‌లో లేడు.. ప్రపంచ కప్ కోసమే పరుగులన్నీ దాచిపెట్టుకుంటున్నాడు.. ప్రతీదానికీ ఓ కారణం ఉంటుందని నేను నమ్ముతా.. నా విషయంలోనూ ఇదే జరిగింది అని యువరాజ్ సింగ్ అన్నాడు.
Read Also: Business Idea: తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్.. లక్షల్లో ఆదాయం..
ధోనీ మంచి లీడర్, అయితే అతనికి మంచి జట్టు దొరకడం వల్లే వరల్డ్ కప్స్ సాధించాడు అని యువరాజ్ సింగ్ అన్నాడు. అయితే, రోహిత్ కూడా మంచి లీడరే.. అతని ఐపీఎల్ ట్రాక్ రికార్డు చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అయితే వరల్డ్ కప్ గెలవాలంటే మంచి జట్టు కూడా కావాలి.. టీమిండియాకు సరైన మిడిల్ ఆర్డర్ లేదు.. ఓపెనర్లు త్వరగా అవుటైతే మిడిల్ ఆర్డర్ లో ఆడగల ప్లేయర్లు ప్రస్తుత జట్టులో కనిపించడం లేదు.. ఇలాంటి జట్టుతో భారత్ వరల్డ్ కప్ గెలవడం చాలా కష్టమేనంటూ యువరాజ్ సింగ్ కామెంట్స్ చేశాడు.