IND Playing XI vs WI: నేడే ఐదవ టీ20.. స్టార్ ప్లేయర్‌పై వేటు! భారత తుది జట్టు ఇదే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Playing XI vs WI for 5th T20I: వెస్టిండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు అద్భుతంగా పుంజుకుంది. మొదటి రెండు టీ20ల్లో ఓడి సిరీస్ చేజార్చుకునే ప్రమాదంలో పడిన భారత్.. తర్వాతి రెండు టీ20లు నెగ్గి సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన నాలుగో టీ20లో 9 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఐదవ టీ20 కోసం సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే సిరీస్ సొంతం అవుతుంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ఫ్లోరిడాలోనే సిరీస్ డిసైడర్ మ్యాచ్ జరగనుంది.
యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మంచి ఊపుమీదున్నాడు. మూడో టీ20లో ఒక రన్ మాత్రమే చేసిన యశస్వి.. నాలుగో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ (84 నాటౌట్; 51 బంతుల్లో 11×4, 3×6)తో రాణించాడు. వరుసగా విఫలమవుతున్న శుభ్‌మన్ గిల్ (77; 47 బంతుల్లో 3×4, 5×6) కూడా గాడిలో పడ్డాడు. దాంతో చివరి మ్యాచ్‌లో కూడా వీరిద్దరే ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఇషాన్ కిషన్ మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్.. నాలుగులో తిలక్ వర్మ ఆడతారు. ఈ ఇద్దరు మంచి ఫామ్ కనబర్చుతున్నారు.
Also Read
- IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
- Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- IND Vs WI: హాఫ్ సెంచరీలతో కదం తొక్కిన రోహిత్, గిల్.. శుభారంభం అందించిన ఓపెనర్స్..
హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్ వరుసగా 5, 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. వీరు ముగ్గురూ మంచి ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. ముఖ్యంగా సంజూ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్ పేస్ కోటాలో బరిలోకి దిగనున్నారు. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు జట్టులో చోటు ఖాయం కాగా.. మరో మణికట్టు యుజ్వేంద్ర చహల్‌కు షాక్ తగిలే అవకాశం ఉంది. నాలుగో టీ20లో భారీగా రన్స్ ఇచ్చిన చహల్ స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఆడే అవకాశం ఉంది. కీలక టీ20 కాబట్టి విండీస్ ప్లేయర్స్ చెలరేగే అవకాశం ఉంది. అందుకే బిష్ణోయ్‌ని భారత్ బరిలోకి దించాలని ప్లాన్ చేస్తోందట. బిష్ణోయ్ బౌలింగ్‌ని విండీస్ ప్లేయర్స్ ఎక్కువగా ఆడలేదన్న విషయం తెలిసిందే. చహల్ స్ధానంలో యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ ఆడినా ఆశ్చర్యం లేదు.
భారత జట్టు (IND Playing XI ):
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజూ శాంసన్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్/యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ముఖేష్ కుమార్.
తాజావార్తలు
-
Revanth Reddy: మానేరు ఇసుక కొల్లగొట్టి రవీందర్రావు, సంతోష్ రావు, కేటీఆర్ రూ.కోట్లు దోచుకున్నారు: సీఎం రేవంత్
-
IND Vs WI: బౌలర్లపై విరుచుకుపడిన రోహిత్ శర్మ, గిల్.. సెంచరీలతో వీరవిహారం.. ఒక్క మ్యాచ్‌లో 5 సెంచరీలు..
-
Revanth Reddy: గత పదేళ్లు సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చారు: సీఎం రేవంత్ రెడ్డి
-
Rohit Sharma: రికార్డుల కోట బద్దలు కొట్టిన రోహిత్ శర్మ.. క్రికెట్ హిస్టరీలోనే..
-
Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!