WC 2023: ఇండియాలో మనకు ఎవరు సపోర్ట్ ఇవ్వరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వన్డే వరల్డ్‌కప్-2023 మెగా ఈవెంట్ కు సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబరు 5న ఈ మెగా టోర్ని ప్రారంభం కానుంది. ఇక ఐసీసీ టోర్నీలో హాట్ ఫేవరెట్ మ్యాచ్ ఏదైనా ఉంది అంటే అది కేవలం.. టీమిండియా- పాకిస్తాన్‌ల మధ్య పోరు అని చెప్పాలి. అయితే ఈ దాయాదుల పోరు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదిక కానుంది.
Read Also: Eiffel Tower: ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు.. అధికారులు అలర్ట్
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
దాయాది దేశాల మధ్య అక్టోబరు 14న మ్యాచ్ జరిపేందుకు ఐసీసీ రివైజ్ షెడ్యూల్‌లో తెలిపింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్ల బలాబలాలు, గెలుపు అవకాశాలపై క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చ కొనసాగుతుంది. ఇక సొంతగడ్డపై మ్యాచ్ జరుగనుండటం టీమిండియాకు అదనపు బలం. కాగా, దీనిపై పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ప్రేక్షకుల నుంచి మనకు ఎలాంటి సపోర్ట్ లభించదు అని అన్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఆటగాళ్లంతా మానసికంగా మరింత బలవంతులుగా తయారు కావాలని చెప్పాడు.
Read Also: Jawaan: మళ్లీ లీకయిన ‘జవాన్’ క్లిప్.. పోలీసులకి ఫిర్యాదు!
మనం మెంటల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే.. అంత తేలికగా అనుకున్న ఫలితాలు సాధిస్తామని షాదాబ్ ఖాన్ అన్నాడు. టీమిండియాపై విజయం సాధించడంతో పాటు ఇండియాలో వరల్డ్‌కప్ గెలిస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకా ఏదీ ఉండదని షాదాబ్ ఖాన్ అన్నాడు. నిజానికి ప్రతి జట్టు టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అయితే, మనకు ఎలాంటి ఆరంభం లభించింది.. ఎలా ముందుకు వెళ్తున్నామనే విషయంపైనే అంతా ఆధారపడి ఉంది.. ప్రతి జట్టుకు ప్రతి మ్యాచ్ కూడా కీలకమేనని షాదాబ్ కామెంట్స్ చేశాడు.
Read Also: INDvsWI: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
కాగా.. రెండేళ్ల క్రితం టీ20 ప్రపంచకప్‌లో భాగంగా దుబాయ్‌లో టీమిండియాను పది వికెట్ల తేడాతో ఓడించిన జట్టులో షాదాబ్ ఖాన్ సభ్యుడిగా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్ కంటే ముందు చిరకాల ప్రత్యర్థి జట్లైన టీమిండియా- పాకిస్తాన్ సెప్టెంబరు 2న శ్రీలంక వేదికగా ఆసియా కప్ టోర్నీలో తలపడనున్నాయి. ఇందుకు సంబంధించి పాకిస్తాన్ ఇప్పటికే జట్టును ప్రకటించగా.. భారత్ మాత్రం ఇంకా జట్టును ప్రకటించలేదు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?