తాజాగా ఈ జాబితాలో స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా చేరాడు. ప్రస్తుతం అతడు వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అశ్విన్ గాయం తీవ్రత గురించి ఇంకా తెలియరాలేదు.. బీసీసీఐ ఇప్పటికే అశ్విన్ గాయంపై ఆరా తీస్తోంది. గాయం మరీ తీవ్రమైనది అయితే అతను కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశం ఉంది.
మాహీ టీమ్‌కి మంచి కెప్టెన్ అవుతాడని అనుకున్నాం. అయితే అతను గొప్ప సారథిగా రికార్డులు క్రియేట్ చేశాడు అని ఈ మాజీ కోచ్ రవిశాస్త్రి తెలిపాడు. మాహీకి ఇప్పుడున్న క్రేజ్‌కి అతని సక్సెసే కారణం.. అంటూ టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి కామెంట్స్ చేశాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌కు టాటూలు అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూర్య శరీరం చూస్తే అందరికి అర్ధమయిపోతుంది. కాళ్లు, చేతులు, మెడ, వీపు, ఛాతి ఎక్కడ చూసినా టాటూలే కనిపిస్తాయి.
ఐపీఎల్ లో అద్భుతంగా రాణిస్తున్న మహీ భారత జట్టుకు హెడ్ కోచ్ గా రావాలని పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్.. భారత జట్టు హెడ్ కోచ్ గా ధోనీ వచ్చే అవకాశం ఉందన్నట్లుగా ఓ చిన్న హింట్ మాత్రం ఇచ్చాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే భారత టీమ్ మిడిలార్డర్ చాలా బలహీనంగా మారింది. రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే గాయాలతో జట్టుకు దూరమయ్యారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈ మ్యాచ్ ఆడటం లేదని ప్రకటించాడు. దీంతో అతను కూడా తొడకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఈ క్రమంలో సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను మళ్లీ జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఐసీసీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ టైటిల్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా అభిమానులు కోరుకుంటున్నారు. వరుసగా రెండో ఏడాది సైతం భారత జట్ట ఫైనల్ కు చేరుకుంది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో ఓడిన ఇండియా ఈసారి ఆస్ట్రేలియాను ఓడించి కప్ దక్కించుకోవాలని చూస్తోంది. జూన్ 7 నుంచి 11 వరకు లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే ఆస్ట్రేలియా-భారత్ జట్లు మ్యాచ్ ఆడే జట్లను ప్రకటించాయి. అయితే టీమ్ ఇండియాను…
రోహిత్ శర్మ పుట్టిన రోజును హైదరాబాద్ లో అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకంగా 60 అడుగుల రోహిత్ శర్మ కటౌట్ ను హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ లోని సుదర్శన్ థియేటర్ దగ్గర ఏర్పాటు చేశారు. ఈ కటౌట్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. క్రికెట్ చరిత్రలో ఏ క్రికెటర్ కు కూడా ఇంత పెద్ద కటౌట్ పెట్టలేదు.
Javed Miandad: పాకిస్తాన్ లో జరగబోయే ఆసియా కప్ క్రికెట్ టోర్నీకి భారత జట్టు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. దీనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కారాలుమిరియాలు నూరుతోంది. పాక్ మాజీ ఆటగాళ్లు భారత్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ నియంతలా ప్రవర్తిస్తోందని పాక్ మాజీ ఆటగాడు, ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విమర్శించారు.