India break world record for scoring fastest team 100 in Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి…
టీమిండియా తరపున తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్ లో చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. హలో అమ్మా.. నీ ప్రార్థనలు ఫలించాయని అన్నాడు. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో ముకేశ్ తెలిపాడు. దీంతో ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో మరింత ఎదిగాలి అని దీవెనలు ఇచ్చింది.
భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు కుప్పకూలిపోకుండా నిలకడగా ఆడుతోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం టీ విరామ సమయానికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (235 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ తో 75 పరుగులు) అర్ధ సెంచరీ చేయగా.. బ్లాక్‌వుడ్ (16 నాటౌట్), అలిక్ అతనజ్ (13 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు. వర్షం కారణంగా మూడో రోజు…
బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన చివరి వన్డేలో టీమిండియా ఉమెన్స్ జట్టు 226 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగింది. కానీ 41.1 ఓవర్లలో స్కోరు 191/4...చేతిలో 6 వికెట్లతో మరో 53 బంతుల్లో 35 పరుగులు చేయాల్సిన పరిస్థితిలో మ్యాచ్ మలుపు తిరిగింది. హర్లీన్ డియోల్, దీప్తి శర్మ ఒకే ఓవర్లో రనౌట్ కావడంతో పాటు.. 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లను కోల్పోయిన భారత్ స్కోరును మాత్రం సమం చేసింది.
బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ సహా ఐదుగురు ఆటగాళ్లు పునరావాసంలో ఉన్నారు. అయితే వారు తిరిగి మ్యాచ్‌లు ఆడేందుకు.. ఎంత ఫిట్‌గా ఉన్నారు. ఎప్పుడు స్టేడియంలోకి అడుగుపెడుతారనే విషయాన్ని బీసీసీఐ శుక్రవారం తెలిపింది.
Virat Kohli Eye on Sachin Tendulkar’s All Time Record: ప్రపంచ ఆల్ టైం ఫేవరేట్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకడు. ప్రస్తుత తరంలో అత్యుత్తమ ప్లేయర్‌గా కొనసాగుతూ ఉన్నాడు. కేన్ విలియమ్సన్, స్టీవ్ స్మిత్, జో రూట్ కూడా కోహ్లీ ఫామ్ ముందు వెనకపడిపోయారు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను ఒక్కడే ఏలుతున్నాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఎవరికీ సాధ్యం కానీ మరెన్నో రికార్డ్స్ తన పేరుపై లిఖించుకున్నాడు. ఇక మరో…
ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే పర్యటనలకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌కు హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు.
Ruturaj Gaikwad is New Team India Captain for Asian Games 2023: చైనాలోని హాంగ్జౌలో జరగనున్న ఆసియా క్రీడలు 2023 (ఏషియన్ గేమ్స్ 2023) కోసం భారత పురుషుల టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన ద్వితీయ శ్రేణి జట్టును శుక్రవారం బీసీసీఐ ప్రకటించింది. ఆసియా క్రీడల కోసం వెళ్లే భారత జట్టుకు యువ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్…
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పూర్తిగా ఆధిక్యం దిశగా కొనసాగుతుంది. మూడో రోజు ఆట స్టార్ట్ కాగానే ఓవర్ నైట్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్క్ ను దాటేశాడు. ఈ క్రమంలోనే అతడు డెబ్యూ టెస్టులో 150 మార్క్ ను అందుకున్న ఐదో అతి చిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును అందుకున్నాడు.
ప్రస్తుతం టీమిండియా వెస్టిండీస్ టూర్లో టెస్టు సిరీస్ ఆడుతుంది. మరో నెల రోజుల పాటు అక్కడే ఉండి వన్డే, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలు ఆడుతుంది. ఆ తర్వాత డిసెంబర్లో సౌతాఫ్రికా టూర్‌కి బయలుదేరి వెళ్లనుంది. డిసెంబర్ 10 నుంచి సౌతాఫ్రికాలో మూడు మ్యాచ్ ల టీ20, వన్డే సిరీస్‌లతో పాటు రెండు టెస్ట్ మ్యాచ్ లు కూడా ఆడుతుంది.