Steve Smith: అరుదైన క్లబ్ లోకి చేరిన స్టీవ్ స్మిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా భారత జట్టుతో ఇవాళ ( బుధవారం ) జరుగుతున్న మూడో వన్డేలో 5000 రన్స్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును చేసిన 17వ క్రికెటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు. తన కెరీర్‌లో 145 వన్డేలు ఆడిన స్టీవ్ స్మిత్.. 12 సెంచరీలు, 30 హాప్ సెంచరీల సాయంతో ఇప్పటి వరకు 5049 పరుగులు చేశాడు. ప్రస్తుతం స్టీవ్ స్మిత్ 74 పరుగులకు మహ్మద్ సిరాజ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయి పెవిలియన్ కు చేరాడు.
Read Also: India-Canada: కెనడా రాకుండా పన్నూని నిషేధించాలి.. ప్రభుత్వాన్ని కోరిన హిందూ సంస్థ
Also Read
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
- Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
ఇక, వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ (463 మ్యాచ్‌ల్లో 18, 426 పరుగులు) పేరు మీద ఉంది. ఆసీస్ విషయానికొస్తే.. ఈ రికార్డు ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ సొంతం చేసుకున్నాడు. పాంటింగ్ 374 వన్డేల్లో 13, 589 రన్స్ చేశాడు. ఆసీస్ తరఫున వన్డేల్లో 10, 000 పరుగుల మార్కును దాటిన ఏకైక ఆటగాడిగా రికీ పాంటింగే ఉండటం ఇక్కడ విశేషం.
Read Also: Skanda: ‘స్కంద’ ప్రీ రిలీజ్ బిజినెస్.. రామ్, బోయపాటి టార్గెట్ ఎంతంటే?
ఇదిలా ఉంటే, టీమిండియాతో మూడో వన్డేలో ఆసీస్ ధాటిగా బ్యాటింగ్ చేస్తుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న ఆస్ట్రేలియా 38 ఓవర్ల తర్వాత 4 వికెట్లు కోల్పోయి 276 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ 4 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకోగా.. డేవిడ్ వార్నర్ అద్భుతమైన హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. ఇక, స్టీవ్ స్మిత్ (74) సిరాజ్ బౌలింగ్ లో అవుట్ కాగా, క్యారీ అలెక్స్ ( 11 ) జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు వెళ్లాడు. ఇక ప్రస్తుతం క్రీజులో లబూషేన్ (31), గ్లేన్ మ్యాక్స్ వెల్ ( 3 ) ఉన్నారు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
-
Ind vs WI: తేలిపోయిన భారత బౌలర్లు.. భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం..
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..