Ravichandran Ashwin Entry: వచ్చేశా, నేను వచ్చేశా.. యాష్ అన్న బస్సు ఎక్కుతున్న వీడియో వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
R Ashwin’s Running Video Goes Viral after Bcci Announce ICC World Cup 2023 India Team: రెండు వారాల ముందు వరకు వన్డే జట్టులో కూడా చోటు లేని సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అనూహ్యంగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 జట్టులోకి వచ్చాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ గాయం అశ్విన్‌కు వరంగా మారింది. ఆసియా కప్ 2023 సందర్భంగా గాయపడ్డ అక్షర్.. చివరి అవకాశం వరకు కోలుకోకపోవడంతో ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అక్షర్ స్థానంలో అశ్విన్‌కు అవకాశం ఇచ్చింది.
ఆర్ అశ్విన్ అనూహ్యంగా వన్డే ప్రపంచకప్ 2023 జట్టులోకి రావడంతో సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో అశ్విన్‌పై మీమ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ ప్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ పోస్ట్ చేసిన వీడియో హైలెట్‌గా నిలిచింది. 2022లో తమిళ్ స్టార్ హీరో విజయ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలోని ఓ సీన్‌ను రాజస్థాన్ ఎడిట్ చేసింది. విజయ్ పరుగెత్తుకుంటూ బస్సును క్యాచ్ చేసే వీడియోలో.. హీరో బదులుగా అశ్విన్ ముఖాన్ని పెట్టింది. ఇక బస్సులో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీల ముఖాలను పెట్టింది.
Also Read
- CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
- Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
- Jasprit Bumrah: వన్డేలకు దూరంగా జస్పీత్ బుమ్రా.. టీమ్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇదే..
- Nepal PM Balendra Shah: భారత్‌కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు! ఏకంగా 6000 వేలు
రవిచంద్రన్ అశ్విన్ పరుగెత్తుకుంటూ వచ్చి బస్సులోని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ముఖాలను చూడడం.. విరాట్ ఇచ్చే హావభావాలు హైలెట్ అయ్యాయి. ‘యాష్ అన్న ప్రపంచకప్ 2023 జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు’ అని రాజస్థాన్ రాయల్స్ క్యాప్షన్ ఇచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకి నెట్టింట లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ‘వచ్చేశా, నేను వచ్చేశా’, ‘యాష్ అన్న ఎంట్రీ సూపర్’ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. యాష్ పరుగెత్తుతున్న వీడియోని చూసి అందరూ తెగ నవ్వుకుంటున్నారు.
2023 World Cup: Enter Ash Anna! 🇮🇳🫡 pic.twitter.com/igb5k84hDV
— Rajasthan Royals (@rajasthanroyals) September 28, 2023
తాజావార్తలు
-
Samsung Galaxy F70 5G: సామ్ సంగ్ Galaxy F70 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే!
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!