టీమిండియా సారథి రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు సృష్టించాడు. రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో వరుస సిక్సర్లతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్ స్వదేశంలో అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు (259) కొట్టిన క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అయ్యేలోపే హిట్ మ్యాన్ 5 సిక్సర్లు కొట్టి.. న్యూజిలాండ్ ప్లేయర్ మార్టిన్ గప్తిల్ (256) పేరుపై ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టి స్వదేశంలో సిక్సర్ల కింగ్‌గా నిలిచాడు.
Read Also: Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్… ఆ కేసులో సీబీఐ దర్యాప్తుకు హోంశాఖ అనుమతి
మరోవైపు అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డుకు దగ్గరలో రోహిత్ శర్మ చేరుకుంటున్నాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ (553) పేరుపై ఉండగా.. అతని రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్ శర్మ కేవలం 4 సిక్సర్ల దూరంలోనే (550) ఉన్నాడు. ఈ విభాగంలో ప్రస్తుత క్రికెటర్లలో ఎవరూ రోహిత్‌కు దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం. మార్టిన్ గప్తిల్ 383 సిక్సర్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక, ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ జోస్ బట్లర్ 312 సిక్సర్లతో 10వ ప్లేస్ లో, విరాట్ కోహ్లీ 282 సిక్సర్లతో 11వ స్థానంలో ఉన్నారు.
Read Also: Pakistan: తుపాకులు వదిలి నాగళ్లు పట్టనున్న పాకిస్తాన్ ఆర్మీ..
ఇదిలా ఉంటే.. టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 రన్స్ తో భారీ స్కోర్ చేసింది. టాప్ 4 బ్యాటర్లు వార్నర్ (56), మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబూషేన్ (72) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో ఆసీస్ టీమిండియా ముందు భారీ టార్గెట్ పెట్టింది. భారత బౌలర్లలో బుమ్రా 3, కుల్దీప్ 2, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ తలో వికెట్ తీసుకున్నారు.
Read Also: Divi Vadthya: దివి.. ఏంటీ పని.. ఈ రేంజ్ హాట్ ట్రీట్ తో తట్టుకోవడం ఎలా?
ఇక, భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌కు శుభారంభం దొరికింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (56 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 81 పరుగులు), వాషింగ్టన్ సుందర్ (18) తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించాడు. అనంతరం సుందర్, రోహిత్ శర్మ ఔట్ కాగా.. క్రీజులో విరాట్ కోహ్లీ ( 38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్ తో 43 పరుగులు నౌటౌట్ ), శ్రేయస్ అయ్యారు ఉన్నారు. 21 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 144/2గా ఉంది. భారత్ లక్ష్యానికి మరో 209 పరుగుల దూరంలో ఉంది. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి.