రాజ్ కోట్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మూడో వన్డే కొనసాగుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్సింగ్స్ లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 352 పరుగులు చేసింది. జట్టుకు ఆసీస్ ఓపెనర్లు శుభారంభం అందించారు. డేవిడ్ వార్నర్ ( 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు) వరుసగా మూడో వన్డేలో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఇక, హాఫ్ సెంచరీ తర్వాత ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ కలిసి రెండో వికెట్‌కి 137 రన్స్ భారీ భాగస్వామ్యం నమోదు చేశారు. మిచెల్ మార్ష్ ( 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు ) సెంచరీకి 4 పరుగుల దూరంలో పెవిలియన్ కు చేరుకున్నాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ట్రై చేసి ప్రసిద్ధ్ కృష్ణకు క్యాచ్ ఇచ్చి మార్ష్ డగౌట్ కి చేరాడు.
Read Also: Muttiah Muralitharan: ముత్తయ్య మురళీధరన్ కి ఇష్టమైన తెలుగు హీరో ఎవరో తెలుసా?
ఇక, మంచి ఊపుమీదున్న స్టీవ్ స్మిత్ ( 61 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు )ని మహ్మద్ సిరాజ్ ఎల్బీడబ్ల్యూ చేశాడు. అలెక్స్ క్యారీ ( 19 బంతుల్లో ఓ ఫోర్‌తో 11 పరుగులు), బుమ్రా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ ( 7 బంతుల్లో 5 పరుగులు )ని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేయగా.. కామెరూన్ గ్రీన్ ( 13 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు ) కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. లబుషేన్, ప్యాట్ కమ్మిన్స్ తో కలిసి ఏడో వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇక, మార్నస్ లబుషేన్ ( 58 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు ) జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్‌లో అవుట్ కాగా, ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ 22 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు, మిచెల్ స్టార్ 1 పరుగు చేసి నాటౌట్‌గా నిలిచారు. దీంతో భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు.. కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్‌లు తల వికెట్ పడగొట్టారు.