రాజ్ కోట్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 66 పరుగుల తేడాతో ఓడిపోయింది. క్లీన్ స్వీప్ చేయాలని భావించిన టీమ్ ఇండియా ఆశలు నెరవేరలేదు.. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 49.4 ఓవర్లలో 286 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ (81) దూకుడుగా ఆడగా విరాట్ కోహ్లీ(56 ) హాప్ సెంచరీతో రాణించాడు. ఇక, శ్రేయస్ అయ్యార్ (48 ), రవీంద్ర జడేజా (35) ఫర్వాలేదనిపించారు. ఇక, మిగిలిన వారిలో కేఎల్ రాహుల్ (26), వాషింగ్టన్ సుందర్ (18), సూర్యకుమార్ యాదవ్ (8)లు విఫలం అయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో గ్లెన్ మాక్స్‌వెల్ ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోగా.. హేజిల్‌వుడ్ రెండు, మిచెల్ స్టార్క్, సంగా, పాట్ కమిన్స్, గ్రీన్ తలా ఓ వికెట్ తీసుకున్నారు. అయితే, టీమిండియా ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికి 2-1తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది.
Read Also: Virat Karrna: పెదకాపుపై ప్రభాస్ కన్ను పడేనా.. కుర్ర హీరో కోరిక తీరేనా.. ?
అయితే, అంతక ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 రన్స్ చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (96), స్టీవ్ స్మిత్ (74), లబుషేన్ (72), డేవిడ్ వార్నర్ (56)లు హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక, భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీయగా కుల్దీప్ యాదవ్ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్ చెరో వికెట్ తీసుకున్నారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఓపెనర్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ లు మొదటి వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఇక, వార్నర్ ఔట్ అయిన తర్వాత మరో ఓపెనర్ మిచెల్ మార్ష్‌తో స్టీవ్ స్మిత్ జతకలిశాడు. ఈ ఇద్దరు బౌండరీలు బాదుతూ స్కోరు వేగం తగ్గకుండా చూశారు. ఈ క్రమంలో మార్ష్ 45 బంతుల్లో, స్మిత్ 43 బంతుల్లో అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.
Read Also: Skanda-Chandramukhi 2: అంచనాలను అందుకోని అడ్వాన్స్ బుకింగ్స్.. అదొక్కటే కాపాడాలి!
ఈ దశలో టీమిండియా బౌలర్లు విజృంభి క్రమంగా వికెట్లు పడగొట్టారు. క్రీజులో నిలదొక్కుకున్న స్మిత్‌ను సిరాజ్ ఔట్ చేయగా.. ఆ తరువాత అలెక్స్ కేరీ(11), మాక్స్‌వెల్(5) లను బుమ్రా పెవిలియన్‌కు పంపించాడు. గ్రీన్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్నప్పటికీ మరో వైపు లుబుషేన్ తనదైన శైలిలో ఆడుతూ 43 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఆఖర్లో ఆసీస్ సారథి ప్యాట్ కమిన్స్ (19 నాటౌట్) తో కలిసి లబుషేన్ ధాటిగా ఆడడంతో ఆసీస్ స్కోరు 350+ దాటింది.