ICC ODI Rankings: ఒకవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లోకి టీమిండియా అడుగు పెట్టగా.. మరోవైపు ఐసిసి వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా టాప్ 10 బ్యాట్స్‌మెన్‌లలో నాలుగు స్థానాలను భారత ఆటగాళ్లు ఉండడం విశేషమే. ఈ ర్యాంకింగ్స్ లో శుభ్‌మన్ గిల్ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోగా.. విరాట్ కోహ్లీ ఒక స్థానం ఎగబాకి నాల్గవ స్థానానికి చేరుకున్నారు. అయితే, కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం రెండు స్థానాలు దిగజారి ఐదవ స్థానానికి చేరుకున్నాడు. దీనికి కారణం రోహిత్ శర్మ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో పెద్దగా రాణించలేకపోయారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో మంచి ఆరంభం అందుకున్నప్పటికీ, ఆయా ఇన్నింగ్స్‌లలో పెద్ద స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. సెమీ-ఫైనల్‌లో కూడా కేవలం 28 పరుగులు మాత్రమే ఆడి ఔటయ్యారు. ఈ ప్రతికూల ఫలితాలు రోహిత్ శర్మ ర్యాంకింగ్‌పై ప్రభావం చూపించాయి.
Read Also: Ajith : అజిత్ తో తలపడేందుకు ధనుష్ భయపడ్డాడా..?
ఇక తాజాగా తిరిగి ఫామ్ సాధించిన విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ప్రదర్శనతో అందరిని మరోమారు ఆకట్టుకున్నాడు. పాకిస్తాన్‌పై సెంచరీ సాధించిన తర్వాత, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో 98 బంతుల్లో 84 పరుగులు చేసి టీం ఇండియాను విజయతీరాలకు చేర్చారు. దీనితో ఆయన రాంక్ కూడా ఒక స్థానం ఎగబాకింది. ఇక శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ.. నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అయితే, అతని రేటింగ్ పాయింట్లు మాత్రం తగ్గాయి. ఇక ఇదేతీరులో శ్రేయాస్ అయ్యర్ కూడా ర్యాంకింగ్స్‌లో లాభపడ్డారు. రెండు మ్యాచ్‌ల్లో అర్ధ సెంచరీలు సాధించిన అయ్యర్.. 9వ స్థానం నుండి 8వ స్థానానికి ఎగబాకారు.
Read Also: Singer Kalpana: “మా అమ్మది సూసైడ్ అటెంప్ట్ కాదు”.. కల్పన కుమార్తె కీలక వ్యాఖ్యలు..
Shubman Gill – Number 1.
Virat Kohli – Number 4.
Rohit Sharma – Number 5.
Shreyas Iyer – Number 8.
KL Rahul – Number 15.INDIAN BATTERS IN TOP 15 ICC ODI RANKINGS 🇮🇳 pic.twitter.com/2KYgIOGWZi
— Johns. (@CricCrazyJohns) March 5, 2025
ఇక బౌలర్స్ విషయానికి వస్తే.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించారు. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసిన ఆయన, ఈ సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో స్థానం సంపాదించారు. దింతో ఒక్కసారిగా ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి 143 స్థానాలు ఎగబాకి, టాప్ 100లోకి ప్రవేశించి 97వ స్థానానికి చేరుకున్నారు. ఇక భారత బౌలర్లలో కేవలం కుల్దీప్ యాదవ్ మాత్రమే టాప్ 10లో నిలిచారు. తాజా ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ మూడు స్థానాలు దిగజారి ఆరో ర్యాంక్ కు చేరుకున్నాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మంచి ప్రదర్శన కారణంగా 11వ స్థానానికి ఎగబాకగా.. ఆ తర్వాత రవీంద్ర జడేజా 13వ స్థానంలో.. మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 14వ స్థానానికి చేరుకున్నారు.