టీమిండియా ప్రమాదంలో పడనుందా..? యంగ్ స్టార్స్ భారత్ ను ముందుకు తీసుకెళ్లగలరా? రెండు దశాబ్దాలుగా ఎదురులేని భారత్ ఒక్కసారిగా ప్రపంచ క్రికెట్ ముందు ఎందుకు బలహీనంగా కనిపిస్తుంది. దీనికి ఎవరు కారణం? గంభీర్ నిర్ణయాలు కొంపముంచుతున్నాయా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలెన్నో తలెత్తుతున్నాయి. కోహ్లీ, రోహిత్ తప్పుకోవడంతో రెడ్ బాల్ క్రికెట్ భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోహ్లీ, రోహిత్ దశాబ్దకాలం పాటు టెస్ట్ క్రికెట్ ను కాపాడుతూ వచ్చారు. టెస్టుల్లో కోహ్లీ నాయకత్వంలో భారత్ చాలా కాలం పాటు నంబర్ వన్ పొజిషన్లో కొనసాగింది.
Also Read:Ajay Devgn : యుద్ధమే పరిష్కారం అయినప్పుడు.. తప్పు లేదు
ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన రోహిత్ రెడ్ బాల్ క్రికెట్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు. దీంతో భారత టెస్ట్ క్రికెట్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం అందరిముందున్న పేరు శుబ్ మన్ గిల్. గిల్ భవిష్యత్తు టెస్ట్ కెప్టెన్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి గిల్ పై అంత నమ్మకమేంటి? టి20లో కెప్టెన్ చేసినట్టు కాదు కదా. సుదీర్ఘ ఫార్మేట్ లో రాణించాలంటే ప్రతిభతో పాటు కాస్త దూకుడుగా వ్యవహరించాలి. ప్రత్యర్థి జట్లు కవ్విస్తాయి, రెచ్చగొడతాయి. అవన్నీ దాటుకుని ముందుకెళ్లాలి.
Also Read:RAPO 22: ఆంధ్ర కింగ్ తాలూకా టైటిల్ గ్లిమ్స్ అదిరింది
మరీ ముఖ్యంగా స్లెడ్జింగ్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన ఆస్ట్రేలియా లాంటి భీకర జట్టును టెస్టుల్లో ఎదుర్కోవాలంటే స్థాయికి మించి ప్రవర్తించాలి. గిల్ ఇప్పటివరకు టి20లో కెప్టెన్ పాత్ర పోషించాడు. 2024లో భారత జట్టు జింబాబ్వేలో పర్యటించింది. ఈ పర్యటనలో గిల్ టీం ఇండియాకు నాయకత్వం వహించాడు. ఈ సిరీస్‌ను భారత్ 4-1 తేడాతో గెలిచింది. కానీ శుబ్ మన్ వన్డే , టెస్టులకు కెప్టెన్సీ చేసిన అనుభవం లేదు. టెస్టుల్లో పెద్దగా అనుభవం కూడా లేదు. 32 టెస్టుల్లో 35.05 సగటుతో 1893 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. గమనించదగ్గ విషయం ఏమిటంటే గిల్ స్వదేశంలో పర్వాలేదనిపించాడు. కానీ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ పిచ్ లపై చాలా కష్టపడ్డాడు.
Also Read:CM Revanth Reddy : రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలి
విదేశీ పిచ్ లపై రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. రిషబ్ గురించి చెప్పుకోవాల్సి వస్తే గబ్బా టెస్ట్ గురించి కచ్చితంగా మాట్లాడుకోవాలి. ఆ మ్యాచ్ లో రిషబ్ 89 పరుగులతో కాలర్ ఎత్తుకునేలా చేశాడు. చివరివరకు నిలిచి గబ్బా వేదికపై భారత్ మీసం మెలేసేలా చేశాడు. మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఈ మ్యాచ్ గురించి కథలు కథలుగా చెప్తాడు. ఆ నాడు రిషబ్ పోరాటం క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. విశేషమేంటంటే ఈ మ్యాచ్ లో గిల్ 91 పరుగులతో సెంచరీ చేరువలో అవుటయ్యాడు. ఫైనల్ గా చెప్పేదేంటంటే భారత టెస్ట్ క్రికెట్ సేఫ్ లో ఉండాలంటే రిషబ్ కి జట్టు పగ్గాలు అప్పగించి, గిల్ ను వైస్ కెప్టెన్ గా నిర్ణయిస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.