రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. దాంతో త్వరలో జరిగే ఇంగ్లండ్ పర్యటనకు కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. యువ ఆటగాడికే టెస్ట్ సారథ్యం అప్పగించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రోహిత్ స్థానంలో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తోందట. టీమిండియా కొత్త కెప్టెన్ విషయంలో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇప్పటికే నిర్ణయం తీసుకుందట. జూన్ 20 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరగనుంది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2025లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా వ్యవహారించాడు. అయితే బుమ్రా తరచుగా గాయపడుతుండడంతో అతడికి కెప్టెన్సీ ఇవ్వడం సరైంది కాదని సెలక్టర్లు భావించారట. శుభ్‌మన్ గిల్ ఐపీఎల్‌లో అద్బుతంగా జట్టును నడుపుతుండడంతో ఆతడి వైపు సెలెక్టర్లు మొగ్గుచూపుతున్నారట. వైస్ కెప్టెన్ విషయంలోనూ సెలక్షన్ కమిటీ ఓ నిర్ణయానికి వచ్చిందట. కీపర్ రిషబ్ పంత్‌కు ఆ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయ్యారట. పంత్ ఫామ్ ఇటీవల అంత గొప్పగా లేకపోయినా విదేశాల్లో అతడి రికార్డ్స్ బాగున్నాయి. అంతేకాదు టెస్టు జట్టులో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. అందుకే పంత్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
🚨 THE LIKELY INDIAN TEST LEADERSHIP 🚨 [PTI]
Captain – Shubman Gill
Vice Captain – Rishabh Pant pic.twitter.com/lvpRBxBw0p
— Johns. (@CricCrazyJohns) May 10, 2025