Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్‌ఫుల్’ కెప్టెన్!
- టెస్టులకు విరాట్ కోహ్లీ వీడ్కోలు
- 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
- 2011లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కోహ్లీ
- 'ది మోస్ట్ సక్సెస్‌ఫుల్' టీమిండియా కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం పొట్టి క్రికెట్‌కు టాటా చెప్పిన కోహ్లీ.. తాజాగా టెస్టులకు గుడ్‌బై చెప్పాడు. ఇక కింగ్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2011లో టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టిన విరాట్.. 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్‌ఫుల్’ టెస్ట్ కెప్టెన్ కూడా. ఆ రికార్డ్స్ ఏంటో ఓసారి చూద్దాం.
2015లో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. జనవరి 2022 వరకు టెస్ట్ కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ.. 68 మ్యాచ్‌లలో సారథిగా వ్యవహరించాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా 40 మ్యాచ్‌ల్లో గెలవగా.. 17 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. ఇక 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విజయశాతం 58.82 శాతంగా ఉంది. ఇది మరెవరికి సాధ్యం కాలేదు. భారత క్రికెట్‌కు 2015-2022 మధ్య కాలం స్వర్ణ యుగంగా నిలిచింది. దాంతో టీమిండియా టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
Also Read: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
ఎంఎస్ ధోనీ 60 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఇందులో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు ఉన్నాయి. ధోనీ విజయ శాతం 45గా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడింది. ఇందులో 21 విజయాలు, 13 ఓటములు ఉండగా.. 15 డ్రాగా ముగిసాయి. దాదా విజయ శాతం 42.86గా ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ 47 టెస్టుల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు.14 విజయాలు, 14 ఓటములు మరియు 19 డ్రాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అజారుద్దీన్ విజయ శాతం 29.78.
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!