భారత్ – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో మూడో రోజు ముగిసింది. అయితే నిన్న ఆట ముగిసే సమయానికి 69 పరుగులతో ఉన్న భారత జట్టు ఈరోజు 7 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసి డిక్లెర్ ఇచ్చింది. అయితే ఈ ఇన్నింగ్స్ లో మయాంక్ అర్ధశతకంతో రాణించాడు. అయితే మిగిలిన ఆటగాళ్లు వేగంగా అదే ప్రయత్నంలో వికెట్లు త్వరగా ఇచ్చేసారు. చివర్లో అక్షర్ పటేల్ కేవలం 26 బంతుల్లో 41 పరుగులు చేసాడు. దాంతో భారత జట్టు లీడ్ 539 పరుగులకు చేరుకుంది.
ఇక 540 పగల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ కు అశ్విన్ షాక్ ఇచ్చాడు. మొదట కెప్టెన్ టామ్ లాథమ్ ను 6 పరుగులకే వెన్నకి పంపిన అశ్విన్… ఆ తర్వాత విల్ యంగ్, రాస్ టేలర్ ను పెవిలియన్ చేర్చాడు. దాంతో 55 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కివీస్ ను డారిల్ మిచెల్ (60) హాఫ్ సెంచరీతో ముందుకు నడిపిస్తుండగా.. అతడ్ని అక్షర్ వెన్నకి పంపాడు. ఆ వెంటనే టామ్ బ్లండెల్ రన్ ఔట్ అయ్యాడు. దాంతో ఈరోజు ఆట ముగిసే సమయానికి కివీస్ 5 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. అయితే ఈ మ్యాచ్ కు ఇంకా రెండు రోజులు సమయం ఉన్న టీం ఇండియా గెలవాలంటే ఇంకా 5 వికెట్లు తీస్తే చాలు.. అదే కివీస్ గెలవాలంటే ఇంకా 400 పరుగులు చేయాల్సి ఉంటుంది.