ఈ మధ్య యూఏఈ వేదికగా జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు అందరిని నిరాశ పరిచిన విషయం తెలిసిందే. టోర్నీలోని మొదటి రెండు మ్యాచ్ లలో పాకిస్థాన్, న్యూజిలాండ్ ఛేహిలో ఓడిపోయిన టీం ఇండియా ఆ తర్వాత మూడు మ్యాచ్ లలో వరుసగా భారీ విజయాలు సాధించింది. అయిన కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో సెమీస్ కు చేరుకోలేదు. ఇక ఈ విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ స్పందిస్తూ… అది తాను చుసిన చెత్త ప్రదర్శన అని చెప్పాడు. అయితే టీం ఇండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచ కప్ లో కూడా ఓడిపోయింది. కానీ అక్కడ ఫైనల్స్, సెమీ ఫైనల్స్ కు చేరుకున్నారు. కానీ ఈ ప్రపంచ కప్ లో జట్టు వారి స్థాయిని అందుకోలేకపోయింది. ఈ టోర్నీలో టీం ఇండియా ప్రదర్శన గత నాలుగు-ఐదేళ్లలో తాను చూసిన అత్యంత చెత్త ప్రదర్శన అని పేర్కొన్నాడు. అలాగే ఈ టోర్నీ మొదట్లోనే జట్టు సరిగ్గా ఆడటం లేదు అనేది అర్ధమైంది. కారణాలు తెలియవై కానీ.. జట్టు తన సామర్థ్యంలో 15 శాతంతో మాత్రమే ఈ టోర్నీలో అదైంది అని దాదా తెలిపారు.