ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన 27 ఏళ్ల అక్షర్ పటేల్ బాల్ తో రాణించాడు… బ్యాట్ తో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో అక్షర్ పటేల్ బ్యాట్ తో రాణించాడు. అయితే మొదటి ఇన్నింగ్స్ లో తన మొదటి టెస్ట్ హాఫ్ సెంచరీని సాధించాడు. అలాగే ఈరోజు రెండో ఇన్నింగ్స్ లో కేవలం 26 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేశాడు. దాంతో భారత 539 ఆధిక్యంలోకి చేరుకుంది.
ఇక ఈరోజు మ్యాచ్ అనంతరం అక్షర్ మాట్లాడుతూ… ఎప్పటికప్పుడు నా బ్యాటింగ్, బౌలింగ్ ను అభివృద్ధి చేస్తూ ఉండటమే నా లక్ష్యం. అయితే ఇన్నాళ్లూ నేను పడిన కష్టానికి ఈ ఏడాది ఫలితం దక్కింది. ఇక నానా బ్యాటింగ్ విషయంలో నా కంటే నా జట్టుకు… యాజమాన్యంకే ఎక్కువ నమ్మకం ఉంది. వారు నన్ను.. నువ్వు చేయగలవు అంటూ నమ్మకాన్ని ఇచ్చారు. అయితే ఇన్ని రోజులు నాకు లభించిన మంచి ఆరంభాని నిలుపుకోలేదు. కానీ ఈ మ్యాచ్ లో ఆ ఆరంభాని కొనసాగించి పరుగులు చేశాను అని అక్షర్ అన్నాడు.