ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ ముగ్గురిని త్వరగా ఔట్ చేసాడు. ఆ తర్వాత ముగిలిన బౌలర్లు కూడా తమ పని ప్రారంభించారు. ఆ వెంటనే డారిల్ మిచెల్ ను అక్షర్ పటేల్ పెవిలియన్ చేర్చగా రచిన్ రవీంద్రను జయంత్ యాదవ్ ఔట్ చేసాడు. ఇక భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ కూడా చెలరేగడంతో కివీస్ రెండో సెషన్ ముగిసే సమయానికే 38 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మూడో సెషన్ ఆరంభంలోనే అశ్విన్ కివీస్ కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస వికెట్లు తీసాడు. ఇక వికెట్లు పడకుండా ఆపాలి అని చూసిన కైల్ జామీసన్ ను చివరి లో అక్షర్ ఔట్ చేయడంతో కివీస్ 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యి భారత్ కంటే 263 పరుగులు వెనుకబడి ఉంది.