ఇండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ లో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ అద్భుతమైన రికార్డ్ నెలకొల్పిన సీషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో జరిగిన మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు తీసి… అలా చేసిన మూడో ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. అయితే ఇప్పుడు తాజాగా మరో రికార్డ్ ను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు అజాజ్ పటేల్. అదేంటంటే.. ఒక్క టెస్ట్ మ్యాచ్ లో ఇండియాపై అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు.
అయితే మొదటి ఇన్నింగ్స్ లో మొత్తం 10 వికెట్లు తీసిన అజాజ్ తర్వాత ఈరోజు రెండో ఇన్నింగ్స్ లో మరో నాలుగు వికెట్లు తీసాడు. దాంతో భారత జట్టు పై టెస్ట్ లో అత్యధికంగా 14 వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఇంతక ముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ పేసర్ ఇయాన్ బోథమ్ పేరిట ఉండేది. 1980లో ఇండియా పై ఒక్క మ్యాచ్ లో 13 వికెట్లు తీసాడు బోథమ్. కానీ ఇప్పుడు 14 వికెట్లతో ఆ రికార్డ్ ను తన పేరిట నెలకొల్పాడు అజాజ్.