ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇన్ని రోజులు ఈ పర్యటన ఉంటుందా.. లేదా అనుకుంటూ ఉండగా… దీని పై ఈరోజు బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. ఈ పర్యటనకు టీం ఇండియా వెళ్తుంది అని… అయితే ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ లు మాత్రమే జరుగుతాయని.. షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్ తర్వాత ఉంటుంది అన్ని అన్నారు.…
ఇండియా – న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో రెండో రోజు ఆట ముగిసింది. అయితే ఈరోజును 221/6 తో ప్రారంభించిన భారత జట్టు మయాంక్ అగర్వాల్(150) అక్షర్ పటేల్ (52) సహాయంతో 325 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన కివీస్ కు భారత బౌలర్లు భారీ షాక్ ఇచ్చారు, వచ్చిన బ్యాటర్ ను వచ్చినట్లు కుదురుకోనివ్వకుండా వెన్నకి పంపించారు. దాంతో ఆ జట్టు 62 పరుగులకే కుప్పకూలిపోయింది. ఇక…
ఇండియా తో జరుగుతున్న రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ జట్టు 62 పరుగులకే ఆల్ ఔట్ అయ్యింది. అయితే ఈరోజు టీం ఇండియా 325 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ జట్టును మొదట సిరాజ్ భారీ దెబ్బ కొట్టాడు. టామ్ లాథమ్, విల్ యంగ్, రాస్ టేలర్ ముగ్గురిని త్వరగా ఔట్ చేసాడు. ఆ తర్వాత ముగిలిన బౌలర్లు కూడా తమ పని ప్రారంభించారు. ఆ వెంటనే…
టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్బోర్న్లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు…
ముంబై టెస్టులో న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఓ టెస్టు ఇన్నింగ్స్‌లో 10కి 10 వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అజాజ్ పటేల్ చరిత్రకెక్కాడు. గతంలో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాపై 10కి 10 వికెట్లు సాధించగా.. 1999లో భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్థాన్‌పై ఈ ఘనత సాధించాడు. ఇప్పుడు 22 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ మళ్లీ ఆ ఘనత సాధించి మూడో…
సౌతాఫ్రికాకు చెందిన ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమిండియా వెళ్లాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ పర్యటనలో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడుతుందని బీసీసీఐ కార్యదర్శి జై షా శనివారం నాడు మీడియాకు వెల్లడించారు. అయితే షెడ్యూల్ ప్రకారం ఆడాల్సిన మూడు టీ20ల సిరీస్‌ను వాయిదా వేస్తున్నామని… ఆ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని ఆయన తెలిపారు. Read Also: ముంబై టెస్టులో విరాట్ కోహ్లీ…
ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా రెండో రోజు లంచ్ సమయానికి 6 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. 221/4 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. మరో నాలుగు పరుగులు జోడించిన వెంటనే టీమిండియా సాహా (27) వికెట్‌ను కోల్పోయింది. ఈ వికెట్ కూడా అజాజ్ పటేల్ ఖాతాలోకే వెళ్లింది. అయితే వెంటనే అదే ఓవర్లో భారత్‌కు మరో షాక్ తగిలింది. ఆల్‌రౌండర్…
విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో భారత జట్టు కు కెప్టెన్ గా తప్పుకొని వన్డే, టెస్ట్ ఫార్మాట్ లలో కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీ పొట్టి ఫార్మాట్ లో కెప్టెన్ గా తప్పుకోవడంతోనే అతడిని వన్డే ఫార్మాట్ నుండి కూడా కెప్టెన్ తొలగించాలి అనే ఆలోచన బీసీసీఐ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ నెల రెండవ వారంలో టీం ఇండియా వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనతో వన్డే కెప్టెన్ గా కోహ్లీ…
న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దాంతో టామ్ లాథమ్ కెప్టెన్సీ లోని కివీస్ జట్టు మొదట బౌలింగ్ చేయనుంది. అయితే ఈ రెండు జట్లు తలపడిన మొదటి మ్యాచ్ డ్రా గా ముగిసిన కారణంగా.. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే ఈ సిరీస్ వారిదే. ఇక ఈ మ్యాచ్ కు ముందు రెండు జట్లలో ముఖ్యమైన ఆటగాళ్లు గాయం కారణంగా…
భారత్ – న్యూజిలాండ్ మధ్య ఈ రోజు ముంబైలో రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కనీసం టాస్ కూడా పడకుండానే ఈ మ్యాచ్ మొదటి రోజులో మొదటి సెషన్ ముగిసిపోయింది. అయితే ముంబైలో గత రెండు రోజులుగా కురిసిన వర్షాల కారణంగా అక్కడ మ్యాచ్ జరిగే వాంఖడే పిచ్ ఇంకా తడిగానే ఉంది. దాంతో టాస్ ను మొదట ఓ గంట సేపు వాయిదా వేశారు అంపైర్లు. అయినా పరిస్థితి మెరుగు పడకపోవడంతో…