ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ దూరం కావడంతో రోహిత్ శర్మతో ఓపెనింగ్‌కు ఎవరు వస్తారో అన్న అంశంపై క్లారిటీ వచ్చింది. తొలి వన్డేలో తనతో పాటు ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాకు వెల్లడించాడు. ఇషాన్ కిషన్ ఒక్కడే ప్రస్తుతం ఆప్షన్‌గా ఉన్నాడని, తనతో పాటు అతడు ఓపెనింగ్ చేయనున్నట్లు రోహిత్ తెలిపాడు.
Read Also: కుంబ్లే-కోహ్లీ మధ్య విభేదాలు.. టీమిండియా మాజీ మేనేజర్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు మయాంక్ అగర్వాల్ జట్టులో చేరాడని, కానీ అతను ఇంకా ఐసోలేషన్‌లో ఉన్నట్లు రోహిత్ తెలిపాడు. క్వారంటైన్ ముగియలేదు కాబట్టి, మయాంక్‌ను తుది జట్టులోకి తీసుకోవడం కుదరదని స్పష్టం చేశాడు. ప్రస్తుతం టీమిండియాలో శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ, రుతురాజ్ గైక్వాడ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-వెస్టిండీస్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది.