గాన కోకిల, ప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు టీమ్‌ఇండియా ఆటగాళ్లు నివాళి అర్పించారు. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో క్రికెటర్లు తమ భుజాలకు నల్ల బ్యాడ్జీలు ధరించారు. లతా మంగేష్కర్ మరణించారనే వార్త తెలుసుకుని ఆట ఆరంభానికి ముందు ఆటగాళ్లు ఆమెకు నివాళి అర్పించారు. ఈ మేరకు ఒక నిమిషం పాటు మౌనం పాటించారు.
Read Also: గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న గుత్తా జ్వాల, విష్ణు విశాల్ దంపతులు
కాగా టీమిండియా ఓవరాల్‌గా ఈరోజు 1000వ వన్డే ఆడుతోంది. అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియం మొతేరాలో వెస్టిండీస్‌తో ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. కడపటి వార్తలు అందేసరికి 22 ఓవర్లలో వెస్టిండీస్ 78 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. స్పిన్నర్ చాహల్ విజృంభించి మూడు వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు సాధించాడు. సిరాజ్ ఓ వికెట్ తీశాడు.