Ind Vs Zim: ధావన్, గిల్ హాఫ్ సెంచరీలు.. పసికూనపై వికెట్ పడకుండా కొట్టేశారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind Vs Zim: హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘనవిజయం సాధించింది. ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 190 పరుగుల విజయ లక్ష్యాన్ని ఊదిపడేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షర్ పటేల్ తలో 3 వికెట్లు తీసి జింబాబ్వేను కట్టడి చేశారు. ఈ నేపథ్యంలో 190 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 30.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు శిఖర్ ధావన్(81 నాటౌట్), శుభ్‌మన్ గిల్(82 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టారు. గత నాలుగు మ్యాచ్‌లలో అటు ధావన్, ఇటు గిల్‌కు మూడో హాఫ్ సెంచరీ కావడం గమనించదగ్గ విషయం. వెస్టిండీస్ పర్యటనలోనూ ధావన్, గిల్ తమ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. దీంతో వీళ్లిద్దరినే కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దింపి విజయం సాధించాడు.
Read Also: Yuzvendra Chahal: సమంత బాటలో చాహల్ భార్య.. అతడితో పార్టీకి హాజరుకావడమే కారణమా?
Also Read
- Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
- IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
- IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
- West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ధావన్ 113 బంతుల్లో 9 ఫోర్లు కొట్టి 81 పరుగులు చేయగా.. శుభ్‌మన్ గిల్ 72 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 82 పరుగులు చేశాడు. ధావన్, శుభ్‌మన్ గిల్ రాణించడంతో తొలి వన్డేలో కేఎల్ రాహుల్‌కు అసలు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. ఐపీఎల్ తర్వాత టీమిండియా తరఫున కేఎల్ రాహుల్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. గాయం కారణంగా దూరమైన అతడికి మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమైంది. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలు ఆడాల్సి ఉండటంతో కేఎల్ రాహుల్ ఫామ్‌పైనే అందరి కళ్లు నెలకొన్నాయి.
తాజావార్తలు
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
-
Hanuman Ansh: తెలుగు రిలీజ్‌తో భారీ బూస్ట్.. 64వ రోజున 60 శాతం పెరిగిన ‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లు!
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!