Asia Cup 2022: భారత్, పాక్ జట్లకు కష్టాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆసియా కప్‌కు ముందు భారత్, పాకిస్థాన్ జట్లకు షాక్ తప్పేలా లేదు. ఈనెల 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం ఇండియా- పాకిస్థాన్‌తోపాటు మిగతా నాలుగు జట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే టోర్నీలో ఫేవరెట్ జట్లుగా దాయాది దేశాలు భారత్- పాకిస్థాన్ ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య తొలి పోరు… ఈనెల 28న దుబాయ్ వేదికగా జరగనుంది. అయితే ఆసియా కప్‌కు ముందు పాక్‌కు షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గాయం కారణంగానే భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆసియా కప్‌కు ఎంపిక చేయలేదు. ప్రపంచ కప్‌కు కూడా బూమ్రా దూరం కానున్నాడని తెలుస్తోంది. టీ-టంట్వీ వరల్డ్ కప్‌కు భారత జట్టును ప్రకటించడానికి ఇంకా నెల రోజుల సమయమే మిగిలుంది. ఇలాంటి పరిస్థితుల్లో బూమ్రా గాయం బీసీసీఐని ఆందోళనకు గురిచేస్తోంది.
Read Also: Sonia Gandhi: సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటివ్
Also Read
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Sandeep Patil: సచిన్, యువీ, గంభీర్, జహీర్‌ను ఎందుకు తప్పించారు..? సీక్రెట్ బయటపెట్టిన సెలక్షన్ కమిటీ మాజీ ఛైర్మన్
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ వారసుడి విధ్వంసం.. బౌలర్లకు చుక్కలు చూపించిన అన్వయ్..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
మరోవైపు పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది కూడా ఆసియా కప్‌లో భారత్‌తో జరగబోయే మ్యాచ్‌కు ఆడటం అనుమానమే! మోకాలి గాయం కారణంగా షాహీన్ షా అఫ్రిది రాబోయే నెదర్లాండ్స్ వన్డే సిరీస్‌కు దూరం కానున్నాడు. ఆసియా కప్‌కు ముందు అఫ్రిది గాయం బారిన పడటంతో.. పాక్‌కు ఊహించని షాక్ తగిలింది. 2022 ఆసియా కప్‌లో మొత్తం 10 మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత జట్టు ఈనెల 20న దుబాయ్ వెళ్లనుంది. యూఏఈకి వెళ్లేముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంది. దుబాయ్ వెళ్లాక… అక్కడ మూడు రోజుల శిక్షణా శిబిరం కూడా ఉంటుంది. ఈనెల 28న జరగనున్న దాయాదుల పోరును ఆస్వాదించేందుకు క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?