Team India: టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభం నుంచి సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ముఖ్యంగా టీ20 క్రికెట్లో అతడు తన విశ్వరూపం చూపిస్తున్నాడు. దీంతో ఐసీసీ ర్యాంకుల్లోనూ సూర్యకుమార్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్లో ఒక్క ఏడాదిలో వెయ్యి పైగా పరుగులు చేసిన తొలి భారత ఆటగాడిగా సూర్యకుమార్ అలియస్ మిస్టర్ 360 రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది ఆడిన అన్ని టీ20…
Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్‌కు దూసుకెళ్లింది. సూపర్-12లో ఉన్న అన్ని జట్లలో భారత్ ఖాతాలోనే ఎక్కువ పాయింట్లు ఉన్నాయి. నాలుగు మ్యాచ్‌లలో విజయం సాధించిన టీమిండియా 8 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. గ్రూప్-1లో టాపర్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఖాతాలో 7 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కప్ మనదేనంటూ పలువురు టీమిండియా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే రోహిత్ సెంటిమెంట్ టీమిండియాను ఊరిస్తోంది. ఎందుకంటే రోహిత్ కెప్టెన్‌గా చేసిన అన్ని ఫార్మాట్లలోనూ…
T20 World Cup: టీ20 వరల్డ్ కప్‌లో మెల్బోర్న్ వేదికగా జరిగిన నామమాత్ర మ్యాచ్‌లో పసికూన జింబాబ్వేపై 71 పరుగుల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల టార్గెట్ బరిలోకి దిగిన జింబాబ్వేను భువనేశ్వర్ కుమార్ తొలి ఓవర్లోనే దెబ్బ కొట్టాడు. ఫస్ట్ బాల్కే మధెవెరేను వెనక్కి పంపాడు. తర్వాత జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోయి చివరికి 115 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు…
IND Vs ZIM: టీ20 ప్రపంచకప్‌లో అడిలైడ్ వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొట్టింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సహాయంతో 51 పరుగులు చేశాడు. రోహిత్ (15) మరోసారి విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 26 పరుగులు…
Roger Binny: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ఐసీసీ సహరిస్తోందని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలపై బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన అఫ్రిది వ్యాఖ్యలపై పెదవి విప్పారు. అఫ్రిది చేసిన ఆరోపణలు సమంజసం కాదని అసహనం వ్యక్తం చేశారు. ఐసీసీ టీమిండియాకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించడం సరికాదని.. ఐసీసీ అన్ని జట్ల విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ఐసీసీ పక్షపాతం…
Virat Kohli: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్, ధోనీ తర్వాత ఆ స్థాయిలో ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్ కోహ్లీ మాత్రమే. గతంలో పరుగుల వరద పారించిన కోహ్లీ మూడేళ్ల పాటు ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. అయితే ఇటీవల ఆసియా కప్ సందర్భంగా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన అతడు టీ20 ప్రపంచకప్‌లో మరోసారి రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో నాలుగు…
Team India: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో ఐసీసీ అండతోనే టీమిండియా విజయాలు సాధిస్తుందని ఆరోపించాడు. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని షాహిద్ అఫ్రిది అన్నాడు. ముఖ్యంగా బంగ్లాదేశ్‌తో వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో ఐసీసీ ఒత్తిడితోనే అవుట్ ఫీల్డ్ చిత్తడిగా ఉన్నా.. అంపైర్లు మ్యాచ్ నిర్వహించారని విమర్శలు చేశాడు. ఎలాగైనా టీమిండియా సెమీస్‌కు వెళ్లాలనే ఆలోచనతోనే ఐసీసీ ఇలా…
ICC Rankings: టీమిండియా యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకుల్లో మరోసారి తన సత్తా చూపాడు. తొలిసారిగా ఐసీసీ ర్యాంకుల్లో నెంబర్ వన్ ర్యాంక్ దక్కించుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌తో పాటు ప్రస్తుత T20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తుండటంతో 863 పాయింట్లు సాధించి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. చాలా తక్కువ సమయంలో సూర్యకుమార్ నంబర్‌వన్ ర్యాంకును పొందాడు. మార్చి, 2021లో అరంగేట్రం చేసి తక్కువ కాలంలోనే ఈ ర్యాంకు పొందాడు. ఈ జాబితాలో 842 పాయింట్లతో పాకిస్థాన్…
IND Vs BAN: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అడిలైడ్ వేదికగా టీమిండియాతో జరగనున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఒకే ఒక్క మార్పు చేసింది. గత మ్యాచ్‌లో రాణించని దీపక్ హుడాపై వేటు వేసింది. అతడి స్థానంలో అక్షర్ పటేల్‌ను తుది జట్టులోకి తీసుకుంది. అటు బంగ్లాదేశ్ కూడా ఒక మార్పు చేసింది. సౌమ్య సర్కార్ స్థానంలో షోరిఫుల్ ఇస్లాం జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో నేడు మరో కీలక సమరానికి టీమిండియా సిద్ధమైంది. అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై అన్ని రంగాల్లో విఫలమైన రోహిత్ సేన పుంజుకుని బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుంది. అయితే వరుణుడు ఎంతమేర సహకరిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇరు జట్లకు ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. బంగ్లాదేశ్ జట్టుపై టీ20ల్లో టీమిండియాకు మంచి రికార్డే ఉన్నప్పటికీ.. 2016 టీ20 ప్రపంచకప్‌లో…