Shakib Al Hasan: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా కీలక మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండర్ షకీబుల్ హసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాము ప్రపంచకప్ గెలిచేందుకు రాలేదని, ఇండియాను ఓడించేందుకే వచ్చామని షకీబ్ చెప్పాడు. భారత్ ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడకు వచ్చిందని.. కానీ తాము ప్రపంచకప్ గెలిచేందుకు ఇక్కడికి రాలేదని తెలిపాడు. తాము టీమిండియాను ఓడిస్తే ఆ జట్టు కలత చెందుతుందని తమకు తెలుసు అని..…
Prithvi Shaw: న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో వన్డే, టీ20 సిరీస్‌లకు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టులో యువ ఓపెనర్ పృథ్వీ షాకు చోటు దక్కలేదు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పృథ్వీ షా విశేషంగా రాణించాడు. ఏడు మ్యాచుల్లో 47.50 సగటుతో 285 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో అతడి స్ట్రైక్ రేటు 191.28గా ఉంది. ఈ నేపథ్యంలో దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నటిప్పటికీ పృథ్వీ షాకు టీమ్‌లో చోటు దక్కకపోవడంపై పలువురు…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో సమరానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మెగా టోర్నీలో మూడు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ సేన రెండు విజయాలు, ఒక ఓటమితో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బుధవారం అడిలైడ్ వేదికగా బంగ్లాదేశ్‌తో టీమిండియా తలపడనుంది. అయితే తాజా సమాచారం ప్రకారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌కు వరుణుడి గండం పొంచి ఉంది. వాతావరణ శాఖ నివేదిక ప్రకారం అడిలైడ్‌లో బుధవారం నాడు 90 శాతం వర్షం కురిసే అవకాశం…
Team India: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా బిజీ బిజీగా గడపనుంది. ఈ మేరకు న్యూజిలాండ్‌లో టీమిండియా పర్యటించనుంది. అక్కడ వన్డేలు, టీ20లు ఆడనుంది. అయితే ఈ రెండు సిరీస్‌ల నుంచి స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా న్యూజిలాండ్ పర్యటన తర్వాత సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో ఆడనున్న టెస్టులు, వన్డేలకు మాత్రం స్టార్ ఆటగాళ్లను సెలక్టర్లు ఎంపిక చేశారు. నవంబర్ 18 నుంచి…
T20 World Cup: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి ఓటమి ఎదురైంది. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అన్ని రంగాలలో భారత్ వైఫల్యం చెందింది. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు, రనౌట్లు మిస్ చేయడంతో విజయం చేజారింది. అయితే ఈ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యిందనే ఆరోపణలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ పిచ్‌పై తొలుత కావాలనే బ్యాటింగ్ తీసుకుందని పలువురు ఆరోపిస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న భారత…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీస్ చేరడం పక్కా అని అభిమానులు భావించారు. అయితే ఇది నిన్నటి వరకే. ప్రస్తుతం దక్షిణాఫ్రికాపై ఓటమి చెందడంతో టీమిండియా సెమీస్ ప్రయాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఒక్క పరాజయం టీమిండియాలోని ఎన్నో లోపాలను బహిర్గతం చేసింది. అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఇంకా మెరుగుపడాలని ఆదివారం నాటి మ్యాచ్ చాటిచెప్పింది. అయితే ఈ గెలుపుతో గ్రూప్-2లో పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు టాప్‌లో కొనసాగిన…
T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు తొలి దెబ్బ పడింది. పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 134 పరుగుల విజయలక్ష్యాన్ని 19.4 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఛేదించింది. మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో వీళ్లిద్దరూ దక్షిణాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించారు. మార్క్రమ్ 41 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 52 పరుగులు చేశాడు. మిల్లర్ 46 బంతుల్లో 59 పరుగులు…
T20 World Cup: పెర్త్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా రెచ్చిపోయింది. తన పేస్ అటాక్‌ను టీమిండియాకు రుచిచూపించింది. దీంతో భారత బ్యాటర్లు అల్లాడిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికా పేసర్లకు దాసోహం అయిపోయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ తన పేలవ ఫామ్‌ను ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించాడు. 9 పరుగులకే అతడు అవుటయ్యాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ 15 పరుగులు మాత్రమే చేశాడు. గత రెండు మ్యాచ్‌లలో హాఫ్…
IND Vs SA: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ముచ్చటగా మూడో సమరానికి సన్నద్ధమైంది. ఆదివారం పెర్త్ వేదికగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సందర్భంగా జట్టులో ఒక మార్పు చేసింది. స్పిన్నర్ అక్షర్ పటేల్ స్థానంలో ఆల్‌రౌండర్ దీపక్ హుడాను జట్టులోకి తీసుకుంది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టాస్ గెలిచిన టీమిండియా మ్యాచ్‌లను కూడా గెలుచుకుంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో…
Gautham Gambhir: టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్ ఎప్పుడు చూసినా విరాట్ కోహ్లీ టార్గెట్‌గా కామెంట్స్ చేస్తుంటాడు. తాజాగా అతడు మరోసారి కోహ్లీపై తన అక్కసు వెళ్లగక్కాడు. టీ20 ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకుపోతున్న కోహ్లీని చూసి సహించలేక తన నోటికి పనిచెప్పాడు. విరాట్ కోహ్లీ కంటే సూర్యకుమార్ యాదవ్ గొప్ప బ్యాట్స్‌మన్ అంటూ కొనియాడాడు. భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ కంటే బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరూ లేరని గంభీర్ అభిప్రాయపడ్డాడు. దీనికి కారణాలను కూడా విశ్లేషించాడు.…