Team India: టీమిండియాలో టీ20 ఫార్మాట్‌కు సంబంధించి ప్రస్తుతం వికెట్ కీపర్ స్థానం ఖాళీగా కనిపిస్తోంది. రిషబ్ పంత్ గాయం కారణంగా దూరం కావడంతో అతడి స్థానంలో ఇషాన్ కిషన్‌కు వరుస అవకాశాలను కట్టబెడుతున్నారు. అయితే అతడు ఒక్క మ్యాచ్ ఆడితే ఆరు మ్యాచ్‌లు ఆడకుండా జట్టును కష్టాల్లోకి నెడుతున్నాడు. వన్డేల్లో ఇటీవల డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్ శ్రీలంకతో టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించాడు. 37 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అయితే రెండో టీ20, మూడో టీ20లలో కనీసం డబుల్ డిజిట్ స్కోర్లను సాధించలేకపోయాడు. అసలే పంత్ దూరమై అనుకోని విధంగా అవకాశాలు దక్కినప్పుడు వినియోగించుకోవాల్సింది పోయి ఇష్టం వచ్చిన రీతిలో ఇషాన్ కిషన్ ఆడుతుండటంతో అభిమానులు మండిపడుతున్నారు.
Read Also: Krishnamachari Srikkanth: వరల్డ్‌కప్ జట్టులో ఆ ఇద్దరు వద్దు.. బాంబ్ పేల్చిన శ్రీకాంత్
మరోవైపు సంజు శాంసన్‌కు వరుస అవకాశాలను ఇవ్వడం లేదు. ఏదో అరకొర అవకాశాలు తప్పితే అతడికి నిలకడగా అవకాశాలు ఇస్తే ఇషాన్ కిషన్‌కు పోటీ ఉంటుందని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఇషాన్ కిషన్‌కు ఇచ్చినన్ని అవకాశాలు సంజు శాంసన్‌కు ఎందుకు ఇవ్వరని అతడి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అటు వన్డే ప్రపంచకప్ వరకు రిషబ్ పంత్ ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఇషాన్ కిషన్ ప్రదర్శన ఇలాగే ఉంటే వన్డేలకు కేఎల్ రాహుల్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అతడు కూడా ఓపెనర్ కమ్ వికెట్ కీపర్ కావడంతో కిషన్‌కు చెక్ పడే ఛాన్స్ ఉంది. టీ20లకు సీనియర్ ఆటగాళ్లను పక్కనబెట్టడంతో ఇషాన్ కిషన్‌కు అవకాశాలు వస్తున్నాయి. ఈ సంగతిని గ్రహించి అతడు నిలకడగా ఆడితే భవిష్యత్ బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.