IND Vs NZ: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమించిన తర్వాత టీమిండియా నేరుగా న్యూజిల్యాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ను భారత్ ఆడనుంది. ఈ క్రమంలోనే ఆదివారం నాడు రెండో టీ20 జరగనుంది. బే ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా యువ ఆటగాళ్లతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే…
IND Vs NZ: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు టీ-20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇవాళ రెండో టీ 20 జరగనుంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించాలని ఇరు జట్లు చూస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో భారత యువ జట్టు కివీస్‌తో తలపడనుంది. టీ 20 వరల్డ్‌కప్ సెమీస్‌లో ఓటమి తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇది. అయితే ఈ మ్యాచ్‌కు కూడా వరుణుడు…
IND Vs NZ: న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్ ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వెల్లింగ్టన్ వేదికగా జరగాల్సిన భారత్- న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే రద్దు అయ్యింది. టాస్ వేసే సమయానికి స్టేడియాన్ని భారీ వర్షం ముంచెత్తింది. ఈ కారణంగా టాస్ కూడా పడలేదు. పలు మార్లు గ్రౌండ్‌ను పరిశీలించిన అంపైర్లు భారీ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించడం…
IND Vs NZ: వెల్లింగ్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడా? కివీస్ బౌలర్లకు చుక్కలు చూపిస్తాడా? పూర్తి వివరాల కోసం కింది వీడియో లింక్ క్లిక్ చేసి చూడండి.
IND Vs NZ: టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా ఈరోజు వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో తొలి టీ20లో తలపడనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, దినేష్ కార్తీక్ లాంటి సీనియర్లు ఈ సిరీస్‌లో ఆడటం లేదు. సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా జట్టుకు నేతృత్వం వహిస్తాడు. హెడ్ కోచ్ రాహుల్…
Hardik Pandya: ఈ నెల 18 నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్, న్యూజిలాండ్ సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల కెప్టెన్లు హార్దిక్ పాండ్యా, విలియమ్సన్ ట్రోఫీతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఓడిపోయినందుకు నిరాశగా ఉందన్నాడు. అయితే విజయం సాధించేందుకు ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని.. తప్పులను సరిచేసుకునేందుకు ప్రయత్నిస్తామని తెలిపాడు. 2024 టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటి నుంచే…
Shubman Gill: టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ బాలీవుడ్ హీరోయిన్‌తో ప్రేమాయణం నడుపుతున్నాడు. ఈ మేరకు అతడు బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజుల క్రితం వీళ్లిద్దరూ డిన్నర్‌కు వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అభిమానులు ఏదో ఉందని గుసగుసలాడుకున్నారు. ప్రస్తుతం కెరీర్లో ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఇటీవల ఓ పంజాబీ టాక్ షోలో పాల్గొన్నాడు. ఈ షోలో సారా అలీఖాన్‌తో డేటింగ్ అంశంపై ప్రశ్నించగా…
Ramiz Raja: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన అనూహ్యంగా సెమీస్ బెర్త్ కైవసం చేసుకుని అక్కడి నుంచి ఫైనల్‌కు చేరింది. అయితే మరో సెమీస్‌లో భారత్ ఓడిపోయి ఇంటిముఖం పట్టడంపై పీసీబీ ఛైర్మన్ రమీజ్ రాజా తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నాడు. టీమిండియా, బీసీసీఐని అవహేళన చేస్తూ మాట్లాడాడు. తమ టీమ్‌పై సందేహాలు వ్యక్తం చేసిన వాళ్లకు ఇప్పుడు సమాధానం దొరికిందని.. అదే సమయంలో బిలియన్ డాలర్ల ఆటగాళ్లు ఉన్న టీమ్ ఇంటికెళ్లిందని ఎద్దేవా చేస్తూ మాట్లాడాడు. గత నెలలోనే…
BCCI: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోర వైఫల్యం నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీలతో త్వరలో బీసీసీఐ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా వీళ్లిద్దరితో భవిష్యత్ టీ20 జట్టుపై చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే టీ20లకు హార్దిక్ పాండ్యాను సారథిగా చేయడంతో పాటు టాలెంట్ ఉన్న కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ అంశంపై త్వరలోనే…
Team India: 2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్‌కు వెళ్లకుండానే వెనుతిరిగిన టీమిండియా ఈ ఏడాది మాత్రం సెమీస్‌కు వెళ్లి ఆశలు రేకెత్తించింది. కానీ సెమీస్‌లో ఇంగ్లండ్‌పై ఘోరంగా ఓటమి చెంది టోర్నీ నుంచి ఇంటి ముఖం పట్టింది. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం టీమిండియాను దెబ్బతీసిందని అభిమానులు విశ్వసిస్తున్నారు. ప్రపంచకప్ ఫైనల్ లేదా సెమీఫైనల్లో టీమిండియా వెనుదిరిగిన ప్రతీసారి భారత ఆటగాళ్లే టాప్ స్కోరర్‌గా ఉన్నారని.. ఈ అంశం భారత జట్టుకు శాపంగా మారిందని అభిమానులు కామెంట్…