Suryakumar Yadav: శ్రీలంకతో జరుగుతున్న మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు, ఐసీసీ నంబర్‌వన్ టీ20 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడో శతకం సాధించాడు. దీంతో పలు రికార్డులను సూర్యకుమార్ తన పేరిట లిఖించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు చేసిన తొలి నాన్ ఓపెనర్‌గా సూర్యకుమార్ చరిత్రకెక్కాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో రోహిత్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మూడు సెంచరీలతో మ్యాక్స్‌వెల్, కొలిన్ మున్రో, సూర్యకుమార్ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. మ్యాక్స్‌వెల్ ఓ మ్యాచ్‌లో ఓపెనర్‌గా సెంచరీ బాదాడు. రోహిత్, కొలిన్ మున్రో తమ జట్లకు ఓపెనర్‌గా సేవలు అందిస్తున్నారు.
Read Also: IND Vs SL: సెంచరీతో సూర్యకుమార్ విధ్వంసం.. మూడో టీ20లో భారత్ భారీ స్కోరు
మరోవైపు అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా సూర్యకుమార్ రికార్డు సృష్టించాడు. గతంలో శ్రీలంకపై రోహిత్ శర్మ 35 బంతుల్లోనే సెంచరీ బాది అగ్రస్థానంలో ఉండగా.. సూర్యకుమార్ 45 బంతుల్లో సెంచరీ అందుకుని ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాకుండా 2023లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇదే తొలి సెంచరీ. భారత్ తరఫున టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా నిలిచిన సూర్య.. కేఎల్ రాహుల్(2)ను అధిగమించాడు. కాగా శ్రీలంకతో మూడో టీ20లో 26 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్.. మరో 19 బంతుల వ్యవధిలోనే మూడెంకల స్కోరు అందుకోవడం గమనించాల్సిన విషయం.