IND Vs SL: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న కీలకమైన మూడో టీ20లో టీమిండియా స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ మరోసారి రెచ్చిపోయాడు. ఎడాపెడా సిక్సులు, ఫోర్లతో విధ్వంసం సృష్టించాడు. దీంతో అంతర్జాతీయ టీ20లలో మూడో సెంచరీ సాధించాడు. అంతేకాకుండా భారత్ తరఫున టీ20లలో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 45 బంతుల్లోనే సూర్యకుమార్ సెంచరీ మార్కు అందుకున్నాడు. దీంతో భారత్ భారీ స్కోరు సాధించింది.
Read Also: BCCI: బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మరోసారి చేతన్ శర్మ నియామకం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు తొలి ఓవర్ మూడో బంతికే షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే మరో ఎండ్‌లో శుభ్‌మన్ గిల్ నెమ్మదిగా ఆడాడు. కానీ సూర్యకుమార్ యాదవ్ మాత్రం వచ్చీ రావడంతోనే బౌండరీలతో శ్రీలంకకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలో 22 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు 45 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 51 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో 112 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేయగా రాహుల్ త్రిపాఠి 35 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అక్షర్ పటేల్ (21 నాటౌట్) మరోసారి రాణించాడు. కాగా ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా (4), దీపక్ హుడా (4) తీవ్రంగా నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 2 వికెట్లు తీయగా.. రజిత, కరుణరత్నె, హసరంగ తలో వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక గెలవాలంటే 229 పరుగులు చేయాలి.