Home Minister Anitha: అనంతపురంలో ఎస్ఐల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మా కూటమిలో ఎలాంటి అంతరుద్ద్యం లేదు.. వైసీపీలో అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలి అని చురకలు అంటించింది.
Asha workers: ఆశా వర్కర్ల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. ఆశా వర్కర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవు మంజూరుతో పాటు గరిష్ట వయోపరిమితిని అంగన్వాడీ కార్యకర్తలతో సమానంగా 62 సంవత్సరాలకు పెంపుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉంది.
అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని…
Kakani Govardhan Reddy: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఇదే తొలిసారి అని మాజీమంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. అందరినీ మోసం చేసినట్లే రైతులను కూడా దగా చేసిన బడ్జెట్ ఇది.. బాబు షూరిటీ.. నో గ్యారంటీ అని ఎద్దేవా చేశారు.
RK Roja: ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శలు గుప్పించింది. జనాన్ని నమ్మించి నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం.. చంద్రబాబును పొగడ్తలతో ముంచేత్తడానికే, భజన చేయడానికే పయ్యావుల కేశవ్ సమయం అంతా వృథా చేశారంటూ ఎద్దేవా చేసింది. రాష్ట్ర ప్రజలకు ఈ బడ్జెట్ ఎందుకు ఉపయోగపడదు..
CM Chandrababu: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు (మార్చ్ 1వ తేదీన) చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు.
చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా జీతాలు సరిగ్గా రావు అని మాజీ మంత్రి బుగ్గన అన్నారు. చంద్రబాబును ఓ చాణక్యుడు, కౌటిల్యుడు అని పోల్చారు.. మరి నాకు తెలిసి ఆయనకు ఏదీ సూట్ కాదు.. ఈసారి బడ్జెట్ కూడా సిస్టమాటిక్ గా పొందుపరచలేదు..
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజాహిత బడ్జెట్ అన్నారు. కమలం వాణి ఎప్పుడూ ప్రజా వాణి.. సమస్యలపై స్పందించడం, ప్రజల మాట వినిపించడం మా పార్టీ విధానం.. రాజకీయంలో మచ్చలేని పార్టీ బీజేపీ అని చెప్పగలం.. వేలెత్తి చూపలేని పార్టీగా మోడీ పాలనలో బీజేపీ ఉందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పేర్కొన్నారు.
CM Chandrababu: ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీఎల్పీ సమావేశం కొనసాగుతుంది. ఈ సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. కష్టాల్లో కూడా మంచి బడ్జెట్ ప్రజలకు అందిస్తున్నాం అని పేర్కొన్నారు.
మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు.. గురువారం రోజు మాధవ్ మీడియాతో మాట్లాడు చేసిన వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ, జనసేన నేతలు.. అయితే, నిన్న మీడియాతో మాట్లాడిన మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్.. రాష్ట్రంలో అంతర్యుద్ధం మొదలవుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కూటమి నేతలు.. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు..