వాళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో సూపర్ సీనియర్స్. పైగా మాజీ మంత్రులు కూడా. కాలం కలిసి రాక… ఇద్దరూ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమై… ఇప్పుడు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నారట. మరొక్కసారి పెద్దల సభలో అధ్యక్షా… అంటామని అడుగుతున్నా… ఓకే అని చెప్పలేని పరిస్థితి. ఏ లెక్కలు వాళ్ళకు అడ్డు పడుతున్నాయి? ఎవరా ఇద్దరు? ఏపీలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై కసరత్తు చేస్తోంది కూటమి. ఈ క్రమంలోనే ఎప్పట్నుంచో ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు…
Vallabhaneni Vamsi Wife: విజయవాడలోని కోర్టు దగ్గర వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ మాట్లాడుతూ.. మూడు రోజులు కోర్టు అనుమతించిన పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ వంశీని న్యాయస్థానం నుంచి సబ్ జైలుకు తరలించడం జరిగిందన్నారు. మూడు రోజులు పోలీసులు కస్టడీలో నా భర్తను అర్థం పర్థం లేని కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో విసిగించారు అని ఆరోపించింది.
సమాజంలో పేదలకు ప్రభుత్వం అండగా ఉండటమే పీ- 4 ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. పీ-4 కోసం నిర్మాణాత్మకమైన స్థిరమైన విధానం ఉండాలి.. అర్హత ఉన్న కుటుంబాలను డేటా బేస్, హౌస్ హోల్డ్, గ్రామసభ ద్వారా గుర్తించాలి అని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూములు ఉన్న వారికి P4 నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు తెలిపారు.
Gorantla Madhav: అనంతపురం జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు. సెక్షన్ 35/ త్రి బీఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. మార్చ్ 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని మాజీ ఎంపీ మాధవ్ కు నోటీసులు అందజేశారు.
Chelluboyina Venu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రెడిబిలిటీ కోల్పోయింది అని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చారు.. తొమ్మిది నెలల పాలనలో ప్రజలకు ప్రభుత్వం చేసిన మోసం అర్థమైపోయిందన్నారు.
Nandamuri Balakrishna: కృష్ణా జిల్లాలోని తన స్వగ్రామం నిమ్మకూరులో పర్యటించిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణతో కొమరవోలు గ్రామస్తులు ఫోటోలు దిగుతుండగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఆ “ఇద్దరూ- ఇద్దరే’. ఒకరు మంత్రి, మరొకరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఇన్నాళ్ళు గట్టు పంచాయితీ కూడా లేని వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏకంగా ఇసుక తుఫానే మొదలైందట. ఇంకా కామెడీ ఏంటంటే… వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న దగ్గర అసలు ఇసుక రీచ్లే లేవు. మరి ఎందుకా వివాదం? ఎవరా ఇద్దరు నాయకులు? తివిరి ఇసుము నుండి తైలం తీయవచ్చంటాడు భర్తృహరి. కానీ… కాలం మారింది కదా…. ఫర్ ఎ ఛేంజ్…ఫ్రీ శాండ్ని పిండేసి…
పండుగ పూట విషాదం.. వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని సూసైడ్! వరంగల్ నగరంలో మహా శివరాత్రి పండుగ పూట విషాదం చోటుచేసుకుంది. ములుగు రోడ్డులోని పైడిపల్లి వద్ద ఉన్న వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న రేష్మిత (20) ఆత్మహత్య చేసుకుంది. రేష్మిత ఈరోజు ఉదయం నుంచి రూములో నుండి బయటకు రాకపోవడంతో కాలేజి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చింది. రేష్మిత ఉంటున్న గది వెంటిలేటర్ నుండి పరిశీలించిన పోలీసులు.. ఆమె ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య…
నేను అన్ని ఆధారాలతో మాట్లాడుతుంటే... బెదిరిస్తున్నారని ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి.. శాసనమండలిలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావిస్తుంటే అధికార పార్టీ సభ్యులు తట్టుకోలేకపోతున్నారన్న ఆయన.. ఆధారాలతో సహా మాట్లాడుతుంటే.. బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు..
Nara Lokesh: గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ సీనియర్ నేతలతో మంత్రి నారా లోకేష్ ఉండవల్లి నివాసంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి ప్రాధాన్యత ఓట్లతోనే కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవాలి అని తెలిపారు.