Nadendla Manohar : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ ఒకేలా ఉన్నారన్నారు. పవన్ కల్యాన్ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించారని.. ఇక ముందు కూడా అలాగే ఉంటారంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలు పడి పార్టీని ఈ స్థాయికి తెచ్చారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే…
ఆ టీడీపీ ఎమ్మెల్యే తనను ఎన్నుకున్న నియోజకవర్గానికి గెస్ట్ ఆర్టిస్ట్ అయిపోయారా? తనకున్న ఏవేవో రాజకీయ అసంతృప్తుల్ని సెగ్మెంట్ మీద చూపిస్తున్నారా? దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా….. ఆయనగారి తమ్ముడు గారు చెలరేగిపోతున్నారా? ఎమ్మెల్యే కాదు… అంతకు మించి అన్నట్టు అనధికారిక దర్పం ఒలకబోస్తున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఆయన షాడో? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు మాజీ మంత్రి కొండ్రు మురళీమెహన్. ప్రస్తుతం తాను సిట్టింగ్గా ఉన్న…
జనసేన పార్టీ 11ఏళ్లు పూర్తి చేసుకుని 12 ఏట అడుగు పెట్టింది. నేడు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఈ సందర్భంగా నేడు కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు. జనసేన 12 ఏళ్ల పండుగ వైభవంగా సాగుతోంది.. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరై కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేస్తారు. సభలో 90 నిమిషాల పాటు ప్రసంగించనున్నారు..
Lokesh : జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి లోకేష్ స్పెషల్ ట్వీట్ వేశారు. పవన్ అన్నకు అంటూ ఆప్యాయంగా స్పందించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ అన్నకు ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ రాసుకొచ్చారు. ఏపీ అభివృద్ధిలో జనసేన పనితీరు ఎంతో కీలకం అన్నారు. ఆ పార్టీ కమిట్ మెంట్ ఏపీ అభివృద్ధికి చాలా కీలకం అన్నారు. Read Also : CM Chandrababu : జనసేనకు ఆవిర్భావ…
Lokesh : మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న వంద రోజుల్లో మంగళగిరి ప్రజలు ఊహించని రేంజ్ లో అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నడుమూరు ఫ్లై ఓవర్లు, రహదారులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. రాబోయే ఐదేళ్లలో మంగళగిరి రూపు రేఖలు మారుస్తానని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన గోశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్…
ఆ ఉమ్మడి జిల్లాలో తగ్గదే…లే… అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. మీరు మర్చిపోదామనుకున్నా… మేం పోనివ్వమంటూ… సోషల్ మీడియా తవ్వకాలు జరిపి పాత వీడియోల్ని వెదికి పట్టుకుని మరీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారట. నాడు మమ్మల్ని ఓ ఆటాడేసుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదులుతామా అని అంటున్నారట. ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? టీడీపీ లీడర్స్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? పవర్లోకి వచ్చాక పగ…పగ… అని రగిలిపోతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,…
రాయచోటి మత సామరస్యానికి ప్రతీక అని చెప్పారు. ఇక్కడి ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు.. కొందరు అల్లరి మూకలు వల్ల ఇటువంటి సంఘటనలు పునరావృతం అయ్యాయని అన్నారు. ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ కొమ్ము కాయకుండా నిజంగా అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
పోసాని తరుపున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత కోపంతోనే తనపై టీడీపీ అధికార ప్రతినిధి ఫిర్యాదు చేశాడు అని పోసాని జడ్జి ముందు తెలిపారు. ఈ కేసులో సెక్షన్ 111 వర్తించదు అని పేర్కొన్నారు.
ఎక్కడైనా అధికార పార్టీ ఎమ్మెల్యేని ప్రతిపక్ష నేతలు ఇరుకున పెట్టడం కామన్. కానీ... అక్కడ మాత్రం స్వపక్షంలోనే విపక్ష తయారైందట. మా ఎమ్మెల్యే అలా చేస్తున్నాడు... ఇలా చేసేస్తున్నాడు. నియోజకవర్గంలో ఫలానా ఘోరం జరిగిపోతోందని అంటూ.. పార్టీ పెద్దలకు పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ చేరవేస్తున్నారట.
ఆ నియోజకవర్గంలో వైన్స్ వ్యాపారులు వణికిపోతున్నారా? లాటరీలో షాపులు దక్కాయ్.... మనమంతా లక్కీ భాస్కర్స్ అని మురిసిపోయిన వాళ్ళకు ఇప్పుడు తత్వం బోధపడుతోందా? ఎందుకొచ్చిన యాపారంరా..