Off The Record: కూటమిలో ఇక కాపు తమ్ముళ్ళకు ప్రమోషన్లు ఉండవా? సైకిల్ పార్టీ కాపు నాయకులంతా త్యాగరాజులుగా మిగిలిపోవాల్సిందేనా? చేతికాడికొచ్చిన పదవుల్ని వాళ్ళొచ్చి తన్నుకుపోతున్నారంటూ... టీడీపీ కాపులు తెగ ఫీలైపోతున్నారా? ఇంతకీ వాళ్ళ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తున్నదెవరు? ఎందుకు పసుపు కాపుల్లో ఫ్రస్ట్రేషన్ పెరుగుతోంది?.
Off The Record: పదిహేనేళ్ళ పాటు బద్ద శత్రువుల్లా ఉన్న ఆ ఎమ్మెల్యేలు ఇద్దరూ ఇప్పుడు మందు, సోడాలా మిక్స్ అయిపోయారట. జానీ వాకర్ మీద ఒట్టేసి చెబుతున్నాం... ఇక మాది దోస్త్ మేరా దోస్త్ బంధం అంటున్నారట. అస్సలు జీవితంలో ఊహించని ఈ పరిణామంతో విశాఖ జనం ఉక్కిరి బిక్కిరి అయిపోయి, అమ్మనీ.... అంతా లిక్కర్ డ్రాప్స్ మహిమ అంటున్నారట.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబు దే అన్నారు. కల్చరల్స్ చూస్తూ నేను చేసిన గబ్బర్ సింగ్ సినిమా గుర్తొచ్చింది.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతలా నవ్వడం ఎప్పుడూ చూడలేదు.. చంద్రబాబు లాంటి బలమైన నాయకుడిని కడుపుబ్బ నవ్వేలా చేసారు అని పేర్కొన్నారు.
Marri Rajasekhar: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు దేశం పార్టీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు.
CM Chandrababu: ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఆ మాట త్వరలో నిలబెట్టుకుంటున్నామన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే సమస్య పరిష్కారం అవుతుందని గతంలోనే చెప్పా.. జిల్లాల వారీగా కేటగీరి విభజన చేయాల్సి ఉంది.
కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈనెల 27వ తేదీన ఉమ్మడి కడప జిల్లా.. జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. గత జిల్లా…
టీడీపీలో కోవూరు కోలాటం రసవత్తరంగా మారుతోందా? ఎమ్మెల్యే మాటల్ని మండల స్థాయి నాయకులు అస్సలు పట్టించుకోవడం లేదా? అవినీతి, అక్రమాలకు దూరం ఉండమని పదే పదే చెబుతున్నా వాళ్ళ చెవికెక్కడం లేదా? ఎమ్మెల్యేనా…. అయితే ఏంటన్న ధోరణి పెరిగిపోతోందా? అసలేం జరుగుతోందక్కడ? నెల్లూరు జిల్లా కోవూరు, బుచ్చిరెడ్డిపాలెం.. కొడవలూరు ..విడవలూరు.. ఇందుకూరుపేట మండలాల్లో విస్తరించి ఉంటుంది కోవూరు అసెంబ్లీ సెగ్మెంట్. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.…
ఏపీ శాసనమండలిలో పెన్షన్లపై వైసీపీ సభ్యులు ప్రశ్నలు సంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే సమయానికి 53 లక్షల మందికి పెన్షన్లు ఉన్నాయని, కూటమి అధికారంలోకి వచ్చే సమయానికి 65 లక్షలకు పెన్షన్లు పెరిగాయని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పేర్కొన్నారు. ఇప్పుడు పెన్షన్లు ఎన్ని తొలగించారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చాక 1.89 లక్షల మందికి తగ్గించారని, బడ్జెట్లో ఉన్న పెన్షన్లకి సరిపడా కేటాయింపులు చేయలేదని వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయేల్ ఫైర్ అయ్యారు. వైసీపీ సభ్యుల…
విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని, అందులోని లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామన్నారు. ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో చర్చించామన్నారు. యువగళం పాదయాత్రలో చేనేతలో కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్కు క్యాబినెట్ ఆమోదం సంతోషాన్నిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ…
చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లి పంచాయతీ కృష్ణాపురం గ్రామంలో ఈనెల 15వ తేదీన టీడీపీ నేత రామకృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. రామకృష్ణ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. రామకృష్ణ తన పంచాయతీ పరిధిలో అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా పేర్కొన్నారు. అయితే, వైసీపీకి చెందిన కే వెంకటరమణ హత్యకాబడిన రామకృష్ణతో ఫిబ్రవరి 10వ తేదీన గొడవపడ్డాడు. రామకృష్ణ తనకు తన కుటుంబ సభ్యులకు ప్రత్యార్థులనుంచి ప్రాణహాని ఉందని సీఐకి ఫిర్యాదు చేసిన ముందస్తు…