Lokesh : మంత్రి నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధి పనులపై కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న వంద రోజుల్లో మంగళగిరి ప్రజలు ఊహించని రేంజ్ లో అభివృద్ధి పనులు స్టార్ట్ చేస్తానని హామీ ఇచ్చారు. పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, నడుమూరు ఫ్లై ఓవర్లు, రహదారులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. మంగళగిరి ప్రజల రుణం తీర్చుకుంటానని.. రాబోయే ఐదేళ్లలో మంగళగిరి రూపు రేఖలు మారుస్తానని తెలిపారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన గోశాలను కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తో కలిసి ప్రారంభించారు.
Read Also : Akhanda 2: సెప్టెంబర్ లో అఖండ 2!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంగళగిరి ప్రజల రుణం తీర్చుకునే బాధ్యత తన మీద ఉందన్నారు. గత ప్రభుత్వం మంగళగిరిని పట్టించుకోకుండా అన్యాయం చేసిందన్నారు. రాబోయే వంద రోజుల్లో మంగళగిరిని పూర్తిగా మార్చేస్తామని వివరించారు. విద్యాశాఖలో తాము చేస్తున్న మార్పులు చూసి అంతా మెచ్చుకుంటున్నట్టు తెలిపారు. ఏపీలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ లక్ష్యం అని.. ఏ ప్రాంతం మీద తమకు వివక్ష లేదన్నారు. తమకు గొప్పలు చెప్పుకునే అలవాటు లేదని.. రాబోయే రోజుల్లో ఏపీ రాజధాని పనులు చాలా వరకు పూర్తవుతాయన్నారు.