ఎమ్మెల్సీలుగా బలహీనవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాం.. బలహీనవర్గాలపై టీడీపీకి ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటాం అన్నారు లోకేష్.. ఇక, యువ మహిళలను ప్రోత్సహించాలని గ్రీష్మకు అవకాశం ఇచ్చామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎంపికపై టీడీపీ కసరత్తు కొనసాగిస్తోంది. మరోవైపు ఆశావహుల్లో టెన్షన్ మొదలైంది. కొంతమందికి ప్రత్యేకంగా ఫోన్ చేసి పరిస్థితి వివరించినట్టు సమాచారం. ఖరారైన అభ్యర్థుల వివరాలు సాయంత్రం లోగా రానున్నాయి. నామినేషన్ కు రెడీ గా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు తీవ్ర ఉత్కంఠ రేకిత్తిస్తోంది.
Sajjala Ramakrishna Reddy: తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైసీపీ రాష్ట్ర సమన్వయ కర్త సజ్జల రామకృష్ణారెడ్డి వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా యువకులు, నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. కూటమి ప్రభుత్వం సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో లక్షలాది మంది విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు అని మండిపడ్డారు.
Chelluboyina Venu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూ. 14 లక్షలు కోట్ల అప్పులపాలైందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ తెలిపారు. శాసన సభలో 6 లక్షల 40వేల కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్పింది.
Home Minister Anitha: విజయనగరంలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఇక, స్త్రీ నిధీ చెక్కును మహిళలకు మంత్రి అందజేసింది.
YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు.. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం..
CM Chandrababu: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు (మార్చ్ 8న) మార్కాపురం వెళ్లనున్నారు. ఇక, 10.45 గంటలకు హెలికాప్టర్ ద్వారా మార్కాపురం చేరుకుని తొలుత జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కాసేపు మాట్లాడనున్నారు. అనంతరం 11.15 గంటల వరకు అధికారులతో భేటీ కానున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురంలో పర్యటించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించే సభ, వేడుకల్లో సీఎం పాల్గొంటారు. ఉదయం 10.30 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మార్కాపురానికి సీఎం వెళ్లనున్నారు. ముందుగా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో మాట్లాడతారు. అనంతరం సభాప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన స్టాల్స్ సందర్శన, లబ్ధిదారులకు పథకాల పంపిణీని సీఎం చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు ఉమెన్స్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విజయం…
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సమావేశాలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. పలువురు సభ్యుల ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. 2023-24 రాష్ట్ర ఆర్థిక సంస్థ లెక్కలపై ఆడిట్ నివేదికను మంత్రి టీజీ భరత్ సభలో ప్రవేశపెట్టనున్నారు. 2015-16, 2016-17, 2017-18, 2018-19 ఏపీ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య లిమిటెడ్ వార్షిక ఆడిట్ నివేదికలకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. అలానే సాధారణ బడ్జెట్‌పై చర్చ జరగనుంది. మండలిలో…
ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఐదు స్థానాలకు గాను...ఒకటి కన్ఫామ్ అయిపోయింది. జనసేన తరపున నాగబాబుని ఇప్పటికే ఖరారు చేశారు. మిగిలిన నాలుగు స్థానాలకు సంబంధించి టీడీపీకి మూడు వస్తాయి. ఒక ఎమ్మెల్సీని తీసుకోవాలా ? వద్దా ? అన్న డైలమాలో కాషాయ పార్టీ పడింది. మూడు మాత్రం పక్కాగా తెలుగుదేశం పార్టీకి వస్తుండటంతో ఆ పార్టీలో పోటీ తీవ్రంగా ఉంది.