Nadendla Manohar : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జాతీయ నేతగా ఎదగాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. పిఠాపురంలో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా పవన్ ఒకేలా ఉన్నారన్నారు. పవన్ కల్యాన్ ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా అందరికన్నా ముందుగా స్పందించారని.. ఇక ముందు కూడా అలాగే ఉంటారంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ ఎన్నో అవమానాలు పడి పార్టీని ఈ స్థాయికి తెచ్చారని.. ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే ప్రజల సమస్యలపై పోరాడుతున్నారని స్పష్టం చేశారు.
Read Also : IPL 2025: ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న టాప్ 10 క్రీడాకారులు..
జనసేన పార్టీ చాలా కష్టాల నుంచి పైకి వచ్చిందన్నారు మంత్రి నాదెండ్ల . 2017లో తాను పార్టీలో జాయిన్ అయినప్పుడు పార్టీకి భవిష్యత్ లేదనే మాటలు వినిపించాయన్నారు. అప్పుడు పవన్ తనతో ఒకటే చెప్పారని.. యువతను అద్భుతమైన నాయకత్వంగా మార్చుకుంటే చాలు అన్నారన్నారు. అదే నేడు పార్టీని ఇలా నిలబెట్టిందని.. దీన్ని కొనసాగించాల్సిన ఆధ్యత మనందరిపై ఉందన్నారు. పవన్ కల్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వానికి అందరం సహకరించాలంటూ కోరారు. గతంలో ఎక్కడ సభ నిర్వహించాలన్నా పోలీసుల నుంచి ఇబ్బందులు వచ్చాయని.. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు.