ఆడవాళ్ళు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు.. పవన్, చంద్రబాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటకు వస్తారు.. పవన్ ప్రజా నాయకుడు కాదు.. చంద్రబాబు కోసం ఉన్న నాయకుడు అంటూ మండిపడింది.
వ్యక్తిగత పర్యటన నిమిత్తం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం అర్ధరాత్రి దేశరాజధాని ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో సీఎంకు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్.. ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పల నాయుడు.. పార్టీ సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు స్వాగతం పలికారు. రాత్రి ఢిల్లీలో బస చేసిన సీఎం చంద్రబాబు.. నేడు పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్ర అభివృద్ధి అంశాలతో పాటు రాజకీయ…
ఏపీ పాలిటిక్స్‌లో తాజా ట్రెండింగ్ లీడర్... వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని, ఇక తాను వ్యవసాయం చేసుకుంటానని చెప్పి వెళ్లిపోయాక... కాకినాడ పోర్టు కేసులో ఆయన ఏ2 గా కేసు ఫైల్ అయింది.
వైసీపీ పాలనలో అడ్డమైన కేసులతో అష్టకష్టాలు పడ్డామని చెబుతుంటారు ఉమ్మడి చిత్తూరు జిల్లా టిడిపి లీడర్స్ అండ్ కేడర్.అక్రమ కేసులతో ఊళ్ళు విడిచి వెళ్ళిన వాళ్ళు సైతం ఉన్నారని అంటారు. కానీ... ఇప్పుడు ప్రభుత్వం మారినా, మా పరిస్థితి మాత్రం మారలేదు. ఏంటీ ఖర్మ మాకు అంటూ తలలు పట్టుకుంటున్నారట తమ్ముళ్ళు. మరీ ముఖ్యంగా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ కేడర్ బాధ అంతా ఇంతా కాదని అంటున్నారు.
Minister Nimmala: నేటి నుంచి రాజమండ్రి జిల్లాలో 45 ఇసుక ర్యాంపులకు అనుమతి ఇస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. గోదావరి వరదల నేపథ్యంలో నాలుగు నెలలు ఇసుక కొరత రాకుండా ఉండేలా ముందు జాగ్రత్త చర్యగా ఇసుక స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
అమరావతిలో చంద్రబాబు అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకావిష్కరణ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్భంగా అసెంబ్లీ కమిటీ హాల్లో రెండు పుస్తకాలను రఘురామకృష్ణరాజు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు ఆవిష్కరించారు. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చేసిన ప్రసంగాలకు సంబంధించి, రెండు పుస్తకాలను జయప్రద ఫౌండేషన్ ప్రచురించింది. ఈ కార్యక్రమంలో పుస్తక రూపకర్త టీడీ జనార్ధన్ మాట్లాడారు.
NDA Corporators: గ్రేటర్ విశాఖ మేయర్ పదవిని గెలిచి సీఎం చంద్రబాబుకి పుట్టినరోజు కానుకగా ఇచ్చామని కూటమి కార్పొరేటర్లు పేర్కొన్నారు. ఈ నెల 26వ తేదీన డిప్యూటీ మేయర్ పై జరిగే అవిశ్వాస తీర్మానాన్ని కూడా మేమే గెలుచుకుంటాం అని ధీమా వ్యక్తం చేశారు.
నేను చంద్రబాబుకి ఏక లవ్య శిష్యురాలిని అంటూ హోంమంత్రి అనిత తెలిపింది. ఆయనను చూసి నేను నేర్చుకున్నాను.. రాబోయే తరానికి కూడా ఆయన స్ఫూర్తిదాయకం.. ఆంధ్రప్రదేశ్ ను 2047కు అగ్రగామిగా ఉంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.. బంగారు కుటుంబంతో ప్రజలతో ఎంతో మంచి చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీది ఒక చెరగని ముద్ర. తెలుగు చరిత్రలోనే చెరగని సంతకం. తెలుగు వాళ్ల ఉనికికి కాపాడిన పార్టీ.. అలాంటి పార్టీకి ప్రాణవాయువు దశ, దిశ, అన్నీ చంద్రబాబు నాయుడే. అలాంటి చంద్రబాబు 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు.