Chelluboyina Venu: తన మనుషులకు లబ్ధి చేకూర్చటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లిక్కర్ పాలసీనే మార్చారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. దీని వల్ల సంవత్సరానికి 1100 కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో 5500 కోట్లు ఖజానాకు నష్ట వచ్చిందని తెలిపారు. చంద్రబాబుకు విచారణ ఎదుర్కొనే ధైర్యం లేదు.. ఎప్పుడూ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంటారని ఆరోపించారు. ఇక, లిక్కర్ స్కామ్ అనేది డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మాజీ మంత్రి వేణు గోపాల కృష్ణ వ్యాఖ్యానించారు.
Read Also: HYDRAA : మారిన హైడ్రా లోగో.. ఇకపై కొత్త లోగోతో హైడ్రా కార్యకలాపాలు
అయితే, సీఎం చంద్రబాబు గతంలోనే డీస్పీలరీలకు పెట్టించి లబ్ధి పొందారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. విశాఖ డీస్పీలరీలకు, మాజీ మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు చెందిన డీస్పీలరీలు ఈ కోవకు చెందినవే అని తెలిపారు. ఈ విషయం ప్రజలకు తెలియదని చంద్రబాబు అనుకుంటున్నారు.. ఇక, రాష్ట్రంలో ప్రతి రోజు అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతున్నాయి.. కానీ, ఈ ప్రభుత్వ ఎక్కడా స్పందించడం లేదని ఆరోపించారు. గతంలోనే టీడీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 43 వేల బెల్ట్ షాపులు ఉన్నాయి.. 4,300 పర్మిట్ రూములు ఉండేవి.. దీంతో రాష్ట్రాన్ని మద్యాంధ్ర ప్రదేశ్ గా చంద్రబాబు మార్చేశారని విమర్శించారు. ఈ పరిస్థితి నుంచి రాష్ట్ర ప్రజలను వైయస్ జగన్ కాపాడారని అన్నారు.