Calcium-Rich Foods: పాల కంటే ఎక్కువ కాల్షియం కావాలా? అయితే నువ్వులను ఇలా వాడి చూడండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Calcium-Rich Foods: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ల నొప్పులు. కీళ్ల మధ్య ఉండే జిగురు తగ్గడం, ఎముకలు బలహీనపడటం వంటి కారణాల వల్ల ఈ నొప్పులు తీవ్రమవుతుంటాయి. అయితే, వీటికి ప్రకృతి సిద్ధమైన ఆహారంతో చెక్ పెట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మన వంటింట్లో ఉండే ‘నువ్వులు’ మోకాళ్ల నొప్పుల నివారణకు అద్భుతంగా పనిచేస్తాయని వాళ్లు వివరిస్తున్నారు.
READ ALSO: Nawab Cafe Review: నవాబ్ కేఫ్ రివ్యూ
Also Read
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
మొలకలు, ఆకుకూరలు వంటి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ, ఎముకల బలానికి కావలసిన కాల్షియం సరైన మోతాదులో అందకపోవచ్చు. కానీ, నువ్వుల్లో అత్యధిక స్థాయిలో కాల్షియం ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. సాధారణంగా పాలు లేదా ఇతర ఆహార పదార్థాల కంటే నువ్వుల్లో కాల్షియం శాతం చాలా ఎక్కువ అని చెబుతున్నారు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నువ్వులను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుందన్నారు.
నువ్వులు ఎలా తీసుకోవాలంటే..
*నువ్వులను నేరుగా తీసుకోవడం కంటే, వాటిని దోరగా వేయించి లేదా పొడి రూపంలో తీసుకోవడం మంచిదన్నారు.
*బెల్లం కలిపిన నువ్వుల ఉండలు తీసుకోవడం వల్ల కాల్షియంతో పాటు ఐరన్ కూడా అందుతుందన్నారు.
*ప్రతిరోజూ అన్నంలో ఒక చెంచా నువ్వుల పొడిని వేసుకుని తినడం వల్ల కీళ్ల నొప్పులు క్రమంగా తగ్గుతాయని చెప్పారు.
వయసు పెరిగే కొద్దీ కీళ్ల మధ్య ఉండే సైనోవియల్ ద్రవం తగ్గిపోయి ఎముకలు ఒకదానికొకటి రాసుకుంటాయి. నువ్వులలో ఉండే సహజ సిద్ధమైన నూనెలు కీళ్లకు అవసరమైన జిగురును అందించి, వాపులను తగ్గిస్తాయన్నారు. 24 గంటల నుంచి వారం రోజుల్లోనే నొప్పుల తీవ్రత తగ్గడం గమనించవచ్చని చెప్పారు. మందుల మీద ఆధారపడటం కంటే, మన ఆహారపు అలవాట్లలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం ద్వారా దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!