Margani Bharat: చంద్రబాబు సమయంలోనే కొత్త డిస్పిలరీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే నాలుగైదు డిస్టిలరీలకు అత్యధికంగా ఆర్డర్లు ఇచ్చేవారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్ వ్యవహారంతో సంబంధం లేని ఎంపీ మిథున్ రెడ్డిని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో మద్యం అమ్మకాలు చేపడుతూ… స్కామ్ ను గత ప్రభుత్వానికి అంటకట్టడం దారుణమని వ్యాఖ్యానించారు. ఇవి కేవలం చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమేనని మార్గాని భరత్ విమర్శించారు.
Read Also: KL Rahul: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..! కెఎల్ రాహుల్ – గోయెంకా మధ్య “కోల్డ్ వార్”..?
అయితే, ఉర్సా కంపెనీకి కేటాయించిన భూముల కుంభకోణాన్ని డైవర్ట్ చేయడానికి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ప్రముఖులను ప్రభుత్వం అరెస్టు చేసే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిల్లో ఆరోగ్య శ్రీ పథకం కింద వైద్యం జరుగుతుందా అని మార్గని భరత్ అడిగారు.