Nadendla Manohar: ఏలూరు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకమైన రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నాం అని తేల్చి చెప్పారు. కానీ, గత వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రేషన్ మాఫియా విచ్చలవిడిగా కొనసాగింది అని ఆరోపించారు. ఇప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితిని చక్కబెడుతున్నాం అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎంత అరాచకం జరిగిందో ప్రజలకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తుంది.. నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని మంత్రి నాదెండ్ల మనోహర్ భరోసా ఇచ్చారు.