Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ (ఏప్రిల్ 20న) మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీని నిలబెట్టుకున్నాం.. ఈ రోజు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. 1
Deputy CM Pawan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ పుట్టిన రోజు సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆర్థికంగా కుంగిపోయి.. అభివృద్ది అగమ్యగోచరంగా తయారై.. శాంతిభద్రతలు క్షీణించిపోయిన ఒక రాష్ట్ర ప్రగతిని పునర్జీవింప చేయడం చంద్రబాబు నాయుడు లాంటి దార్శనికునికి మాత్రమే సాధ్యం అవుతుంది.
కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా తనపై మద్యం కేసు పెట్టారని వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ఆరోపించారు. ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా శనివారం సిట్ అధికారుల ఎదుట మిథున్‌రెడ్డి హాజరయ్యారు. విచారణ ముగిసిన తర్వాత విజయవాడలో మిథున్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మూసి పునరుజ్జీవం చేస్తామంటే.. బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తు్న్న విషయం తెలిసిందే. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులను తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో జపాన్ లో ఉన్న తెలంగాణ వాసులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. “తెలంగాణలో పరిశ్రమలు రావాల్సి ఉంది.. మన దగ్గర భూమి సరిపడా ఉంది.. పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం.. గుజరాత్ లో సబర్మతి కట్టుకున్నారు.. బీజేపీ వాళ్లు డిల్లీలో యమున నది…
గ్రేటర్ విశాఖ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.. వైసీపీ మేయర్‌పై అవిశ్వాస పరీక్షలో ఓటమిపాలయ్యారు.. అయితే, మేయర్ మీద అవిశ్వాసం గెలిచారు.. కానీ, విశాఖ ప్రజల మనసుల్లో విశ్వాసం కోల్పోయారు అంటూ వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్... విశాఖ మేయర్ ఎన్నికల్లో పరిణామాలపై ఆయన స్పందిస్తూ.. బలం లేకుండా అవిశ్వాస తీర్మానం నోటీసు అందజేశారని.. ధర్మం, న్యాయం గురించి మాట్లాడే హక్కు కూటమి నాయకులకు లేదని దుయ్యబట్టారు.. అయితే విప్ ఉల్లంఘించిన…
గ్రేటర్ విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. ఇప్పుడు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు..? డిప్యూటీ మేయర్ ఎవరు అనేదానిపై దృష్టిసారించింది.. మేయర్, డిప్యూటీ మేయర్ పై టీడీపీ, జనసేన మధ్య చర్చలు సాగుతున్నాయి.. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. 96వ వార్డు టీడీపీ కార్పొరేటర్ పీలా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది..
ఆంధ్రప్రదేశ్‌లోనే పెద్దదైన గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. మేయర్ హరివెంకట కూమారిపై పెట్టిన అవిశ్వాసం తీర్మానాన్ని కూటమి పార్టీలు నెగ్గించాయి.. అయితే, అవిశ్వాస తీర్మానం కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.. మరోవైపు, పార్టీ మారిన కార్పొరేటర్లను కట్టడి చేసేందుకు విప్ జారీ చేసినా వైసీపీ వ్యూహం ఫలించలేదు.
విశాఖ మేయర్‌పై అవిశ్వాస తీర్మానంపై ఉత్కంఠ రేగుతోన్న వేళ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్.. అసలు, విశాఖ అభివృద్ధి కోసమే మేయర్ పై అవిశ్వాసం పెట్టినట్టు తెలిపారు.. నాలుగేళ్ల తర్వాత పాలనను సమీక్షించుకునే అవకాశం చట్టం కల్పించింది.. 9 నెలల కోసం రాజకీయ ప్రయోజనాలను ఆశించిన మార్పు కోరుకునే వాళ్లం కాదన్నారు..
రాష్ట్రంలో వైజాగ్ మేయర్ అవిశ్వాసం ఉత్కంఠ రేపుతోంది. మేజిక్ ఫిగర్ పై ఊగిసలాట కొనసాగుతోంది. మేయర్ హరివెంకట కుమారి పై కూటమి ఇచ్చిన అవిశ్వాసం నోటీసుపై ఓటింగ్ కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రలోభాలు హద్దులు దాటాయి. వైసీపీ, టీడీపీ విదేశాలలో క్యాంప్ లు తెరచి దశల వారీగా కార్పొరేటర్లను అక్కడకు తరలించాయి. శిబిరాల్లో ఉన్న వాళ్ళను కట్టడి చేసేందుకు సీనియర్లను కాపాలాపెట్టిన పరిస్థితి. మ్యాజిక్ ఫిగర్ 74దాటేశామని కూటమి ప్రకటించుకుంటోంది. ఇటీవల నలుగురు కార్పొరేటర్లు వైసీపీకి…