దారుణహత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి అంత్యక్రియలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామానికి మధ్యాహ్నం 3 గంటలకు సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. వీరయ్య చౌదరికి నివాళులర్పించి.. ఆయన కుటుంబసభ్యులను సీఎం పరామర్శించనున్నారు. వీరయ్య చౌదరి అంత్యక్రియలకు పలువురు టీడీపీ ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు.
టీడీపీ నాయకుడు వీరయ్య చౌదరి దారుణ హత్య ఒంగోలులో కలకలం రేపింది. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో ఒంగోలు బైపాస్ రోడ్డులో తన కార్యాలయంలో ఉన్న వీరయ్యని దుండగులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపారు. కత్తుల దాడిలో వీరయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్యని నలుగురు కత్తులతో పొడిచినట్టు పోలీసులు గుర్తించారు. నిందితులను పట్టుకునేందుకు 12 బృందాలు ఏర్పాటు చేశారు.
Also Read: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్రదాడిలో విశాఖ వాసి మృతి.. పారిపోతున్నా వెంటాడి మరీ..!
హోంమంత్రి అనిత అర్థరాత్రి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ మార్చురీలో వీరయ్య డెడ్ బాడీ ఉంది. పోస్టుమర్టం పూర్తయిన తరువాత వీరయ్య బాడీనిస్వగ్రామం అమ్మనబ్రోలు తరలించనున్నారు. సాయంత్ర వీరయ్య పార్థివ దేహానికి అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.