Buddha Venkanna: బాహుబలి రెండే పార్టులు.. కానీ, కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకు.. అంటే పది పార్టుల వరకు ఉంటుంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని.. మాజీ ఎంపీ కేశినేని నాని మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోన్న వేళ.. కేశినేని నానిపై విరుచుకుపడ్డారు వెంకన్న.. పదేళ్లు పార్లమెంటు మెంబర్‌గా ఉండి ఆ పార్టీని, అధ్యక్షుడుని లెక్క చేయకుండా మట్లాడిని వ్యక్తి నాని అని ఫైర్ అయ్యారు.. టీడీపీ తరఫున ఎంపీగా ఉంటూ వైసీపీకి ఒక కోవర్టుగా నాని పని చేశాడు.. రాష్ట్రంలో అతిపెద్ద స్కాం లిక్కర్‌లో జరిగింది.. గూగుల్ పే, ఫోన్ పే లేకుండా డబ్బంతా పక్కదారి పట్టించారు.. లిక్కర్ స్కాం మీద దృష్టి మరల్చడానికి నాని మరోసారి కోవర్టు అవతారం ఎత్తాడు.. కేశినేని చిన్ని, కేశిరెడ్డి మీద ఈడీకి కేశినేని నాని కంప్లైంట్ ఒక డైవర్షన్ మాత్రమే అని విమర్శించారు.
కేశినేని నాని భాగోతం మొత్తం చీకటి భాగోతం.. విజయవాడలో పెద్ద హోటల్ కడతామని అప్పు చేసాడు కేశినేని నాని.. కేశినేని హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్ ను కేశినేని హారిక ప్రైవేటు లిమిటెడ్ మార్చాడు అని ఆరోపించారు బుద్దా వెంకన్న.. తాతినేని రాము, కాట్రగడ్డ హేమంత్ లను డైరెక్టర్ లుగా చేర్చాడు.. హోటల్ నడుస్తోంది.. బ్యాంకుకు అప్పులు ఎందుకు తీర్చడం లేదు? అని ప్రశ్నించారు.. అయితే, రేపు ఈడీకి, సీబీఐకి లేఖ రాయనున్నట్టు ప్రకటించారు వెంకన్న.. కేశినేని చిన్ని వంక పెట్టుకుని పార్టీని డేమేజ్ చేస్తున్నారని మండిపడ్డారు.. ఆంధ్ర క్యాంటీన్ పేరిట పెట్టి 12 శాతం జీఎస్టీ వసూలు చేసి, ప్రభుత్వానికి 5 శాతం మాత్రమే కడుతున్నాడు.. కేశినేని నాని.. నన్ను పార్టీలో చాలా ఇబ్బంది పెట్టాడు.. ఇప్పుడు, సంబంధమే లేని చిన్ని పేరు ఈడీకి రాసిన లేఖలో పేర్కొన్నారని దుయ్యబట్టారు.. ఇప్పుడు చెప్పిన ఈ అంశం కేశినేని నాని మీద మా నా మొదటి బాణం.. కేశినేని నాని.. టాటా గ్రూపును కూడా మోసం చేసిన స్కామ్ ఉంది.. కేశినేని ట్రావెల్స్ లో దొంగ రసీదులు సృష్టించి, బ్యాంకులకు అప్పు ఎగ్గొట్టాడు నాని.. కేశినేని నాని చేసిన అక్రమాలు ఇంకా పది ఉన్నాయి.. 43 కోట్లు హోటల్ పైన బ్యాంకుకు కట్టాలి.. కేశినేని నాని చీటింగ్ 1 నుంచి 10 వరకూ ఉంది.. బాహుబలి రెండే పార్టులే అంటూ సంచలన ఆరోపణలు చేశారు..