ఈరోజు హిందూపురం మున్సిపల్ వైస్ చైర్మన్-1 జబీవుల్లాపై అవిశ్వాసం జరగనుంది. ఇప్పటికే అవిశ్వాస తీర్మానంపై సంతకాలతో కలెక్టర్‌కు కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పదవీకాలం నాలుగు సంవత్సరాలు పూర్తవడంతో.. అవిశ్వాస తీర్మానికి కౌన్సిలర్లు సిద్దమయ్యారు. జబీవుల్లాపై టీడీపీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఆమోదానికి సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు కౌన్సిల్ హాల్‌లో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.
నాలుగేళ్ల పదవీ కాలం ముగియడంతో జబీవుల్లాను పదవి నుంచి తప్పించి.. టీడీపీలో ఉన్న కౌన్సిలర్‌కు వైస్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని అధికార పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా జబీవుల్లాపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదిస్తూ.. 23 మంది సభ్యుల సంతకాలతో కలెక్టర్‌కు కౌన్సిలర్లు నోటీసు ఇచ్చారు. దాంతో కలెక్టర్ నేడు మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాదు ప్రత్యేక అధికారిగా పెనుకొండ ఆర్డీవో ఆనంద్ కుమార్‌ను నియమించారు.
Also Read: AP News: రౌడీ షీటర్ పప్పు రాయల్‌ను చావబాదిన క్రికెట్ ప్లేయర్స్!
హిందూపురం మున్సిపాలిటీలో 38 మంది కౌన్సిలర్లు, ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కలిపి మొత్తం 40 ఓట్లు ఉన్నాయి. టీడీపీ బలం 22 మంది కౌన్సిలర్లు కాగా.. వైసీపీకి 16 మంది సభ్యుల బలం ఉంది. అవిశ్వాస తీర్మానంపై ఏర్పాటైన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగాలంటే 27 మంది సభ్యుల కోరం తప్పనిసరి. హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ గెలుపొందడంతో వైస్ చైర్మన్ విషయంలో వైసీపీ నాయకులు అప్రమత్తమయ్యారు. 16 మంది కౌన్సిలర్లను వైసీపీ నాయకులు క్యాంపుకు పంపారు. వైసీపీ కౌన్సిలర్లు కౌన్సిల్ ప్రత్యేక సమావేశానికి హాజరు కాకపోతే.. కోరం లేక ఇవాళ సమావేశం వాయిదా పడే అవకాశం ఉంది.