2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు.. వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదని, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప అని విమర్శించారు. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి చెంద్రబాబు సమాధానం చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. నేడు అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు.
‘కర్ణుడు చావుకి 100 కారణాలు అన్నట్టు, వైసీపీ పార్టీ ఓటమికి చాలా కారణాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో చేసింది ఏమీ లేదు, లక్ష 50 వేల కోట్ల రూపాయలు అప్పు తప్ప. ప్రధాని మోడీ అమరావతికి ఎందుకు వచ్చారు, అమరావతిలో ఇప్పటివరకు ఏమి చేశారు, ఏమి చేస్తారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రధాని శంకుస్థాపన చేసిన వైజాగ్ రైల్వే జోన్ ఏది, రైల్వే జోన్ పనులు ఏమైనా అసలు ప్రారంభించారా?. వైజాగ్‌లో ఏకరా భూమి 99 పైసలకు దారపోశారు. సింహాచలంలో ఏడుగురు మరణానికి ఎవరు కారణం, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే’ అని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Also Read: AP Govt: మహిళా ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక నుంచి 180 రోజులు సెలవులు!
‘సంక్షేమం, అభివృద్ధిని వైఎస్ జగన్ రెండు కళ్లుగా చూశారు. సీఎం చంద్రబాబు తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేశారు. కూటమి 11 నెలల పాలనలో ప్రజలకు ఒరిగింది ఏమి లేదు. రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో ప్రజలు గమనించాలి. మూడు టీవీ ఛానళ్లు, మూడు పేపర్లతో చంద్రబాబు పబ్బం గడుపుకుంటున్నారు’ అని బొత్స సత్యనారాయణ విమర్శించారు. అనకాపల్లిలో జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో గుడివాడ్ అమర్ నాథ్, బూడి ముత్యాల నాయుడు, కన్నబాబు, వరుదు కల్యాణి, శోభ హైమావతి తదితరులు హాజరయ్యారు.