వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. మాజీ మంత్రి విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరుపై మండిపడ్డ ఆయన.. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండని, వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలని సూచించారు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారని జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘వైసీపీ శ్రేణులపై దాడులు మినహా కూటమి ప్రభుత్వం చేసిందేమీ లేదు. విడుదల రజనీపై పోలీసులు వ్యవహారించిన తీరు దారుణం. సీఐ సుబ్బారాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలి. అక్రమంగా వైసీపీ నేతలపై పెట్టిన కేసులు ఉపసంహరించండి. వైసీపీ నేతలను అణగద్రోక్కలనే దోరణి మానుకోవాలి. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలుపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, ఉచిత బస్సు అంటూ పథకాలకు చరమగీతం పలికారు’ అని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తూర్పుగోదావరి జిల్లాలో మాట్లాడుతూ మండిపడ్డారు.
Also Read: Gottipati Ravi Kumar: విద్యుత్ చార్జీలు పెంచబోము.. వారికే రెడ్ బుక్ వర్తిస్తుంది!
‘రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ పరిస్థితి దారుణంగా మారింది. రాష్ట్రంలో వైసీపీ శ్రేణులను అణిచివేయాలని చూస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న రాజ్యాంగాన్ని చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ మనస్సు కూడా ఆవేదన చెందుతుంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అరెస్టుల విషయంలో పోలీసులు తమనుతాము ప్రశ్నించుకోవాలి. మాజీమంత్రి విడదల రజనీ విషయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. రానున్న ఎన్నికలలో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని జక్కంపూడి రాజా పేర్కొన్నారు.