మొన్నటి ఎన్నికల సమయంలో ఆ నేతలిద్దరి ప్రచారానికి.. పరస్పర ఆరోపణలకు సోషల్ మీడియా మంచి వేదికైంది. పైసా ఖర్చులేని వ్యవహారం కావడంతో కేడర్, అభిమానులు ఏ పోస్టులు పెట్టినా గో ఏ హెడ్ అన్నారట ఆ ఇద్దరు. కట్‌చేస్తే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులు మరీ శ్రుతిమించిపోతున్నాయట. దీంతో ఒకప్పుడు సంబరపడిన నేతలే ఇప్పుడు ఆ సోషల్ మీడియా పోస్టులకు ఫీలవుతున్నారట. ఇంతకీ నేతలకు సోషల్ మీడియా తెచ్చిన తలనొప్పులేంటి? ఇద్దరికీ ఎన్నికల్లో ఉపయోగపడ్డ సోషల్…
గట్టిగా ఉన్నామని అనుకున్నచోట టీడీపీ నేతల లెక్కలు వర్కవుట్ కావడం లేదా? అంతా ఆరంభ శూరత్వమేనా? బలహీనతలు తెలిసీ నేల విడిచి సాము చేస్తున్నారా? కేడర్ వద్దని వారించినా పంతాలకు పోయి.. ఎందుకు పరాజయాలను మూట కట్టుకుంటున్నారు? అది ఎక్కడో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. విశాఖలో కీలక అంశాల్లో టీడీపీ అభాసుపాలు! రాజకీయ చైతన్యానికి విశాఖ వేదిక. ఇక్కడ టీడీపీ కూడా గట్టిగానే ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సిటీలోని నాలుగు ఎమ్మెల్యేల స్థానాల్లో టీడీపీ…
మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. దీంతో.. ఆయనపై 153 ఏ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు… అయితే, కేసులపై సీరియస్‌గా స్పందించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఏవరిని రెచ్చగొట్టారని కేసు నమోదు చేశారో తెలియదని కామెంట్ చేసిన ఆయన.. కేసు పెట్టిన విషయం కూడా…
సామాజిక సమతౌల్యం సాధ్యం అవుతుందని చేసి చూపిస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. తన గత ఐదేళ్ల హయాంలో రాజ్యసభ స్థానాలను అగ్ర కులాలతో నింపిన వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్నినాని అన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులు వస్తే ఒకటి కమ్మ, ఒకటి క్షత్రియకు ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు సిగ్గు లేకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీల గురించి మాట్లాడుతున్నారు. ప్రభుత్వ విధానాలను తప్పు పట్టలేక పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో అలజడి సృష్టించి, దాడికి…
ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా జేసీ బ్రదర్స్‌ను కేసులు వెంటాడుతూనే ఉన్నాయి.. కొన్ని కేసులు టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి జైలులో కూడా ఉండివచ్చారు.. రిలీజైన వెంటనే మళ్లీ కేసులు వెంటాడాయి. ఇక, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయ్యారు జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఆయనపై తాజాగా మరో కేసు నమోదైంది.. మీసం మెలేస్తూ, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై తాడిపత్రి పట్టణ…
ఆరు నెలల్లో టీడీపీని బీజేపీలో విలీనం చేయటం ఖాయమని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గోబెల్స్ అయితే అంతకు మించిన వ్యక్తి దేవినేని ఉమా అని… ఉన్నది లేనట్లు అభూత కల్పనలు చేస్తుంటాడని మండిపడ్డారు. నిన్న ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లి అక్కడి ప్రజలపై దుర్భాషలాడాడని… మా పార్టీ నేత కారు అద్దాలు పగలగొడితే దాన్నే దేవినేని ఉమా కారు అని చూపించారని ఆరోపించారు. read also :ఏపీ కరోనా అప్డేట్..తగ్గిన కేసులు దాడి చేయడమే కాకుండా…
ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారా? షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంలో ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోమాట మాట్లాడుతున్నారా? ఇంతకూ ఎవరా ఎమ్మెల్యేలు? ఆ తగువు వెనక అసలు కథేంటి? విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్‌పై చర్చ విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్, నాన్ షెడ్యూల్ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80…
తాడిపత్రి రాజకీయాలు మళ్లీ హీటెక్కాయి. కూల్చివేతలు.. మాటల తూటాల వెనక పొలిటికల్ పన్నాగం ఇంకేదో ఉందనే చర్చ జరుగుతోంది. మద్దతుదారులను లక్ష్యంగా చేసుకున్నారనే అనుమానం ఒకరిది. రూల్ పాటించకపోతే ఎలా అని చట్టానికి పదును పెడుతున్నారు ఇంకొకరు. దీంతో ఆదిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారనే ఉత్కంఠ పెరుగుతోంది. ఆక్రమణల కూల్చివేతలతో రాజకీయ వేడి! ఏపీలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రిలో మాత్రమే టీడీపీ పాగా వేసింది. జేసీ బద్రర్స్ ఎత్తుగడలే దానికి కారణం. సింపుల్ మార్జిన్‌తో…