అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఆళ్లగడ్డలో ఇష్టం వచ్చినట్టుగా పన్నుల వసూళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆమె.. అకౌంట్లలో నగదు వేస్తే ప్రజలు నోరు మూసుకుని ఉంటారని ప్రభుత్వం నీచమైన ఆలోచన చేస్తోందంటూ ఆరోపించారు.. ప్రభుత్వం మున్సిపాలిటీలను అ భివృద్ధి చేయకుండా పన్నులు మాత్రం విపరీతంగా పెంచుతోందని, ప్రజలపై భారం మోపి ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలోని షాపులకు ప్రభుత్వం మూడేళ్లకు…
ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు విమర్శలు పెంచాయి.. దీంతో.. అదే స్థాయిలో ఎదురుదాడికి దిగుతోంది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ… ఇవాళ మీడియాతో మాట్లాడిన వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి… విపక్షాల కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. చంద్రబాబు హయాంలో కేవలం 8 వేల మందికే ఉద్యోగాలిచ్చారన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వం 1.84 లక్షల ఉద్యోగాలిచ్చిందని.. గ్రామ సచివాలయాల్లోనే 1.30 లక్షల మందికి ఉద్యోగాలిచ్చామని.. ఇవి కాకుండా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.. ప్రభుత్వ…
తెలంగాణ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా బక్కని నర్సింహులును ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నియమించారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఈ నేపథ్యంలో ఎల్ రమణ స్థానంలో బక్కని నర్సింహులును నియమించారు చంద్రబాబు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన బక్కని నర్సింహులు… 1994-99 లో షాద్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. read also : టోక్యో ఒలింపిక్స్‌లో కరోనా కలవరం ఈ…
తాడేపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబుపై కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో రైతలను చాలా ఇబ్బందులకు గురి చేశారని… రైతులు కొట్టిన చావు దెబ్బకు టీడీపీ 23 స్థానాలకు పరిమితం అయిందని చురకలు అంటించారు. చంద్రబాబు ఎప్పుడైనా 21 రోజుల్లో ఒక రైతుకు అయినా ఐదు రూపాయలు చెల్లించారా?? అని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ళకు డబ్బులు ఇవ్వడం లేదని చంద్రబాబు విమర్శిస్తున్నారని…చంద్రబాబు గత ఐదేళ్ల పాలనలో ఏడాదికి సగటున 55 లక్ష మెట్రిక్…
టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం గెజిట్ విడుదల చేయడంతో… చంద్రబాబు బాగా నిరాశ పడ్డాడని ఎద్దేవా చేశారు. ”కృష్ణా జలాలపై ఇద్దరు సీఎంలు పగలు తిట్టుకుని రాత్రి ఫోన్లో పరామర్శించుకుంటారని చంద్రం ఫ్రంట్ పేజీలో ఘోషిస్తున్నాడు. రాత్రి వేళ నిద్ర మానుకుని నీచపు కుట్రలకు ప్లాన్ చేసేది ఎవరు? ఢిల్లీలో అర్థరాత్రి చిదంబరం కాళ్లు పట్టుకున్నదెవరు? నీ సొంత అనుభవాలను ఇతరులకు ఆపాదిస్తే ఎలా? కృష్ణా ప్రాజెక్టులపై…
పవర్ పోవడంతో.. ఢీలాపడ్డ ఆయనకు గట్టిగానే ఎదురు దెబ్బలు తగిలాయి. రానురానూ వాటికి అలవాటు పడిపోయారో ఏమో.. ఎవరైనా తమ బాధలు చెబితే.. వెయిట్ ప్లీజ్ అంటున్నారట. మన టైమ్ వచ్చే వరకూ ఓపిక పట్టాలని ప్రవచనాలు ఇస్తున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా హితోక్తులు? అచ్చెన్న మాటల్లో దూకుడు లేదా? ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడి తాజా వైఖరి తెలుగు తమ్ముళ్లను ఆశ్చర్య పరుస్తోంది. అధికారంలో ఉన్నా.. విపక్షంలోకి జారినా మొన్నటి వరకు దూకుడుగా…
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది… పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, గతంలో తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన శోభాహైమావతి.. టీడీపీకి గుడ్‌బై చెప్పారు.. 1999-2004 మధ్య ఎస్.కోట ఎమ్మెల్యేగా పని చేసిన హైమావతి… గత ఎన్నికల కంటే ముందు వరకు తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలుగా పనిచేశారు.. పార్టీల్లో వివిధ హోదాల్లో సేవలు అందించారు. అయితే, ప్రస్తుతంలో ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోవడానికి తోడు… టీడీపీలో అంతర్గత రాజకీయాలు కూడా ఎక్కువైనట్టుగా…
మీరంతా (ప్రజలు) నా వెంట ఉన్నంత కాలం నా లైన్ ఎవరు మార్చలేరు… ఎవరు ఏమి మాట్లాడినా నన్ను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు.. తెలంగాణ భవన్లో టి.టీడీపీ మాజీ అధ్యక్షుడు ఎల్.రమణకు పార్టీ కండువా కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేసీఆర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో ఎవరు పాత్ర ఏంటో అందరికీ తెలుసు అన్నారు.. తెలంగాణ వచ్చాక ఏమి జరిగిందో జనం కళ్ల ముందు ఉందన్న ఆయన.. తప్పు…
సైకిల్ దిగి కారెక్కిన ఎల్ రమణ లోడ్ ఎత్తాలా? ఆయనకు ఎలాంటి పదవీ యోగం ఉంది? ఈటల ఎగ్జిట్ తర్వాత రమణకు రెడ్‌కార్పెట్ పరిచిన టీఆర్ఎస్.. కేబినెట్లోకి తీసుకుంటుందా? ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ఆయనకు ఇచ్చిన మాటేంటి? ఈటల ఎపిసోడ్ తర్వాత పెరిగిన ప్రాధాన్యం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటూ.. ఆ పదవికి రాజీనామా చేసి.. టీఆర్ఎస్లో చేరిన ఎల్ రమణకు అధికారపార్టీలో లభించే ప్రాధాన్యం ఏంటి? మారిన రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఆయనకు కలిసి…
అనంతపురం : ఏపీ మంత్రి శంకరనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు. టిడిపి ప్రభుత్వ హాయంలో రోడ్డు డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి రూ. 2,000 వేల కోట్ల నిధులను పసుపు – కుంకుమకు మళ్లించారని ఆరోపణలు చేశారు. అచ్చెన్మాయుడుకు ఈ విషయం తెలియదా…! 2017 నుంచి 2019 వరకు టిడిపి హాయంలో రోడ్ల మరమ్మత్తులు చేపట్టలేదని మండిపడ్డారు. read also : ఏపీలో ఆ వైసీపీ ఎమ్మెల్సీకి కొత్త కష్టాలు ! పాత మరమ్మత్తు బకాయిలను…